పోయిల లక్ష్మణ్ కు డాక్టరేట్
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని,జూన్ 26(కలం శ్రీ న్యూస్):మంథని మండల పరిధిలోని కన్నాల గ్రామానికి చెందిన పొయిల లక్ష్మణ్ కు హైదరాబాదులోని మనం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చక్రవర్తి కడప గండ చేతుల మీదుగా హానరబుల్ డాక్టరేట్ ను సోమవారం అందించడం జరిగింది. సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలందించిన పొయిల లక్ష్మణ్ డాక్టరేట్ ను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా హానరబుల్ డాక్టరేట్ ను అందుకున్న పొయిల లక్ష్మణ్ మాట్లాడుతూ ఇంత పెద్ద గౌరవప్రదమైన డాక్టరేట్ తనకు అందించినందుకు మనం ఫౌండేషన్ వారికి తన అభినందనీయ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కన్నాలవాసికి డాక్టరేట్ రావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.