ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సహాయం అందించిన బొద్దుల లక్ష్మణ్
పెద్దపల్లి,జూన్24(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బండారికుంట కు చెందిన మేకల రాములు ఐలమ్మ ల కూతురు రజిత వివాహానికి ఆర్థిక సహాయం అందించాలని స్థానిక నాయకులు కెసిఆర్ సేవా దళం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, పద్మశాలి సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జూలపల్లి మండల జడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ ని కోరగా వెంటనే స్పందించి కెసిఆర్ సేవా దళం నాయకుల ద్వారా వారికి ఆర్థిక సహాయం మరియు చీర అందించడం జరిగింది.
పెద్దపల్లి జిల్లా యువ నాయకులు బొద్దుల లక్ష్మణ్ నీ అడిగిన వెంటనే స్పందించి సహాయం అందచేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన పెళ్ళి కూతురు తల్లితండ్రులు, గ్రామస్తులు.
ఈ కార్యక్రమంలో కెసిఆర్ సేవా దళం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు దండే వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు బింగి రాజు, ప్రధాన కార్యదర్శి చాతళ్ళ కాంతయ్య, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బొద్దుల సాయినాథ్, పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు షేక్ షకీల్, జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.