Tuesday, December 3, 2024
Homeతెలంగాణగజ్వేల్ పట్టణంలో అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి

గజ్వేల్ పట్టణంలో అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి

గజ్వేల్ పట్టణంలో అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి

డబల్ బెడ్ రూమ్ ఎంపికలో మోసం,అర్హులకు ఇవ్వకపోతే ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేస్తాం 

డబల్ బెడ్ రూమ్ సాధన కమిటీ కన్వీనర్ సందబోయిన ఎల్లయ్య

గజ్వేల్,జూన్20(కలం శ్రీ న్యూస్):గజ్వేల్ పట్టణంలో గతంలో ఎంపిక చేసిన సర్వే సమగ్రంగా లేదని, అనర్హుల పేర్లు తొలగించాలని, అర్హుల పేర్లు చేర్చి వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డబల్ బెడ్ రూమ్ సాధన కమిటీ కన్వీనర్ సందబోయిన ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గజ్వేల్ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో డబల్ బెడ్ రూమ్ సాధన కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇప్పటికీ పలు దఫాలుగా అధికారులకు ప్రజాప్రతినిధులకు అర్హులకు సంబంధించిన జాబితాను అధికారులకు అందజేయడం జరిగింది. గత ప్రభుత్వం 2250 మందికి సర్టిఫికెట్లు ఇచ్చిన వాటిని మొత్తం రద్దు చేసి మీకే ముందుగా ఇస్తామని తెలిపి, వారిని ఎంపిక చేయకుండా సొంత బిల్డింగులు, జాగాలు ఉన్న వారిని ఎంపిక చేసి పేదలని మోసం చేయడం జరుగుతుందని అన్నారు. సర్వేలో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు నలుగురిని ఎంపిక చేయడంతో పాటు చనిపోయిన వారికి కూడా ఎంపిక చేసి అక్రమాలకు పాల్పడడం జరిగిందని అన్నారు. మేము 20 సంవత్సరాలుగా వివిధ రకాల ఉపాధి చేసుకొని బతుకుతున్నామని, గజ్వేల్ అభివృద్ధిలో భాగస్వామ్యం మాకు ఇల్లు కావాలని, 20 సంవత్సరాలు గా తిరిగిన ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. మొదటి ప్రాధాన్యతగా గతంలో ఇచ్చిన సర్టిఫికెట్లు ఎంపిక చేసి సమగ్రంగా పరిశీలన చేసి ఇండ్లస్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేనిచో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు కిరాయిలు, అత్యవసర సరుకులు ధరలు పెరిగి ప్రజల తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రంగారెడ్డి, డబల్ బెడ్ రూమ్ సాధన కమిటీ నాయకులు పద్మక్క, నర్సింలు, కవిత, మహేందర్, వెంకటచారి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!