Wednesday, January 15, 2025
Homeతెలంగాణపదేండ్లలో మంథని పట్టణ ప్రగతికి బాటలు

పదేండ్లలో మంథని పట్టణ ప్రగతికి బాటలు

పదేండ్లలో మంథని పట్టణ ప్రగతికి బాటలు

మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ 

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని జూన్ 16(కలం శ్రీ న్యూస్):ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే మంథని పట్టణ ప్రగతికి బాటలు పడ్డాయని మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా శుక్రవారం మంథని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం పట్టణ పురవీధుల్లో ప్రదర్శనలు నిర్వహించి బస్టాండ్‌ ఎదురుగా ప్రధాన రహదారిపై మహిళలు బతుకమ్మ ఆట ఆడారు.అలాగే పట్టణంలోని మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసినివాళులు అర్పించారు. అనంతరం గాంధీచౌక్‌లో ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మెన్ పుట్ట మధుకర్ మరియు అడిషల్ కలెక్టర్ దీపక్ కుమార్ హాజరు అవగా ఆమె సభాధ్యక్షత వహించి మాట్లాడుతూ గత పాలకుల హయాంలో మంథని అభివృధ్దికి ఆమడ దూరంలోనే నిలిచిపోయిందన్నారు.2014లో అప్పటి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా తనకు అవకాశం ఇస్తే మంథని ప్రజల రుణం తీర్చుకునే విధంగా అనేక అభివృధ్ది కార్యక్రమాలు చేపట్టామన్నారు. మంథని ప్రాంతానికి చెందిన ప్రముఖులు,మేధావుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు.పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాల కల్పనపై దృష్టి సారించామని వివరించారు.ఒకప్పుడు దుర్గందం వెదజల్లే ఇస్మాన్‌పుర రూపురేఖలు మార్చి ఈనాడు ఉస్మాన్‌పురలో పట్టణ వాతావరణం కల్పించిన చరిత్ర ఉందని,అంబేద్కర్‌ నగర్‌లో సైతం అనేక సౌకర్యాలు మెరుగుపర్చామని ఆమె గుర్తు చేశారు.మున్సిపాలిటీగా మారిన తర్వాత పన్నుల భారం పడుతున్న క్రమంలో జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ సహకారంతో పన్నుల బారం తగ్గించేలా ఆలోచనలు చేస్తున్నామని ఆమె వివరించారు. వ్యాపారులకు సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని,దుకాణ సముదాయ భవనంపై మరో అంతస్తు నిర్మాణం చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు.గతంలో దుర్గందంతో నిండిన బొక్కలవాగును ఈనాడు సుందరీకరించామని, రావుల చెరువు,తమ్మిచెరువు, బొక్కలవాగు కట్టలపై సీసీ రోడ్లు,వాకింగ్‌ ట్రాక్‌లు నిర్మించి ప్రజలకు సౌకర్యాలు మెరుగుపర్చామని ఆమె తెలిపారు.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం,సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో మంథని మున్సిపాలిటీ ఎంతో అభివృధ్ది చెందిందని,ప్రజలు గత ప్రభుత్వాలు,గత పాలకుల పనితీరు,ఈనాడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జరిగిన అభివృధ్దిని బేరీజు వేసుకోవాలని ఆమె సూచించారు.రాబోయే రోజుల్లో మంథనిని అన్ని విధాలుగా అభివృధ్ది చేసి ఆదర్శంగా నిలుపాలన్నదే తమ ఆకాంక్ష అని, ఆ దిశగానే అడుగులుముందుకు వేస్తున్నామని ఆమె తెలిపారు. అనంతరం మున్సిపల్‌లో ఉత్తమసేవలు అందించిన కార్మికులకు ప్రశంసా పత్రాలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!