మంథని సింగిల్ విండో సుతిలి కుంభకోణం పై ఈనెల 23న విచారణ…
ఆదేశాలు జారీ చేసిన జిల్లా సహకార అధికారి.
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 15(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా మంథని సింగిల్ విండో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరిగిన కోట్లాది రూపాయల విలువైన సుతిలి కుంభకోణం పై ఈనెల 23న జరిగే విచారణకు హాజరు కావాలని జిల్లా సహకార అధికారి మైఖేల్ బోస్ ఆదేశాలు జారీ చేశారు.
వివరాల్లోకి వెలితే పెద్దపల్లి జిల్లా మంథని సింగిల్ విండో ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు ఇతర కేంద్రాల్లో సుతిలి కొనుగోలు పేరిట గత 3 సంవత్సరాలుగా జరుగుతున్న కోట్లాది రూపాయల వ్యయంతో పాటు ఇతర ఖర్చుల పేరిట జరిగిన కుంభకోణం పై విచారణ జరిపించాలని కోరుతూ ఏప్రిల్ 17న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కి ప్రజావాణి లో ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ మేరకు జిల్లా కలెక్టర్ సూచన మేరకు పెద్దపల్లి జిల్లా సహకార అధికారి కె. మైఖేల్ బోస్ పెద్దపల్లి జిల్లా సహకార అధికారి కార్యాలయంలో ఈనెల 23 శుక్రవారం జరిగే విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ మంథని సింగిల్ విండో కార్యదర్శి తో పాటు ఫిర్యాదు దారుడి ఐన నాకు ఆదేశాల ప్రతిని అందించారు.స్పందించి విచారణకు ఆదేశాలను జారీ చేసిన జిల్లా అధికారులకు ధన్యవాదాలు తెలిపిన ఇనుముల సతీష్,