Wednesday, January 15, 2025
Homeతెలంగాణసింగిల్విండో కార్యాలయంలో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

సింగిల్విండో కార్యాలయంలో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

సింగిల్విండో కార్యాలయంలో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

మంథని మే 2(కలం శ్రీ న్యూస్):తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ ఆవరణలో శుక్రవారం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరిపినారు.ఈ సందర్భంగా సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించినారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షుడు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, డైరెక్టర్లు లెక్కల కిషన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్,దేవళ్ల విజయకుమార్,ఎంపిపి కొండ శంకర్,జెడ్పీటీసీ తగరం సుమలత శంకర్ లాల్,ఏఎంసి చైర్మన్ ఎక్కటి అనంతరెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు ఆకుల కిరణ్, ఏఎంసి మాజీ చైర్పర్సన్ శ్రీరాంభట్ల సంతోషిణి,మున్సిపల్ వైస్ చైర్మన్ అరెపల్లి కుమార్,కౌన్సిలర్లు వికే.రవి,గుండా విజయలక్ష్మి పాపారావు,శీపతి బాణయ్య, గర్రెపల్లి సత్యనారా యణ, కొట్టె పద్మ రమేష్,కుర్ర లింగయ్య,కో ఆప్షన్ సభ్యులు యాకూబ్,గట్టు రాధాకిషన్,ఏఎంసి డైరెక్టర్లు వేల్పుల గట్టయ్య, జంజర్ల లింగయ్య, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బత్తుల సత్యనారాయణ, బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు కొండ రవీందర్, కెడిసిసి బ్యాంక్ మేనేజర్ దుమ్మని లక్ష్మణ్, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, నాయకులు మాచీడి సత్యనారాయణ,మందల సత్యనారాయణ రెడ్డి, డిగంబర్, బాబా,మంథని విజయ్ కుమార్, ఇర్ఫాన్,రామడుగు మారుతి, సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!