Wednesday, January 15, 2025
Homeతెలంగాణవాకర్స్ అసోసియేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు

వాకర్స్ అసోసియేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు

వాకర్స్ అసోసియేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు

బెల్లంపల్లి,మార్చి26(కలం శ్రీ న్యూస్):బెల్లంపల్లి తిలక్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆదివారం మార్కెట్ చౌరస్తాలో 300 మందికి భవన నిర్మాణ కార్మికులు,రోజువారి కూలి కార్మికులు,నిరుపేదలకు అల్పాహారం అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిధులుగా బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ శంకరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాకర్స్ అసోసియేషన్ ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమం గత అక్టోబర్ నెల నుంచి ప్రతి ఆదివారం కొనసాగుతూనే ఉన్నదని, వాకర్స్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ముందు ముందు కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు అసోసియేషన్ సభ్యుల ను పలువురు అభినందిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి తిలక్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రత్నం రాజన్న,ఉపాధ్యక్షులు రంగా రామన్న,ప్రధాన కార్యదర్శి నాగేష్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు గెల్లీ జయరాం యాదవ్,గంట శ్రీనివాస్,వెంకటస్వామి, టీ.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!