వెంకటస్వామి స్మ్రుత్యర్థంగా తెలంగాణ వైభవం
మంథని రిపోర్టర్ నాంపల్లి శ్రీనివాస్
మంథని మార్చి 25(కలం శ్రీ న్యూస్ ):ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కరుడు గట్టిన వాదము వినిపించిన స్వర్గీయ జి.వెంకటస్వామి స్మ్రుత్యర్థంగా తెలంగాణ సామాన్యుల వైభవాలు పతాకగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు విజయవంతం చేయిలనీ వర్దిల్లు తెలంగాణ సంస్థ అధ్యక్షుడు కొండేల మారుతి పిలుపు నిచ్చారు.మంథని టి జంక్షన్ లో గల స్వర్గీయ వెంకటస్వామి విగ్రహానికి మాలాలంకృతం చేసారు. తదంనంతరం వక్తలు ఆత్మీ యతకు ఆప్యాయత కు మారు పేరుగా విఖ్యాతమైన కాకాజీ సేవలను స్తుతించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో మంత్రిగా విరాజిల్లిన ఆయన సేవాతత్పరత స్మ్రుత్యర్థంగా ఇట్టీ కార్యాక్రమాల నిర్వహణమని మారుతి విశదీకరించారు.
తెలంగాణ సామాన్యుల వైభవాలు పతాకగా మంథని అసెంబ్లీ నియోజక వర్గం కరీంనగర్ పూర్వ జిల్లా హైదరాబాద్ రాష్ట్ర స్థాయిలో మూడంచెల లో కార్యక్రమాలు జరుగుతాయన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి మలి ఉద్యమ పంథాలో పాల్గొన్నవారి పాత్రధారులు గా మాటలు ఆటలు పాటలు అంశాల వారిగా ప్రదర్శనలు ఉంటాయన్నారు. వీటినందు పాల్గొనదలచిన వారు ఈ వారం రోజుల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.
వెంకటస్వామి స్మ్రుత్యర్థ తెలంగాణ సామాన్యుల వైభవాలు.కార్యక్రమ గౌరవ సలహాదారులు గా కొండపాక సత్యప్రకాశ్,తాటి బుచ్చయ్య గౌడ్, ఛీఫ్ కోఆర్డినేటర్స్ గా పోతు జ్యోతిరెడ్డి, భోగోజు శ్రీనివాసు, మేడగోని రాజమౌళి గౌడ్ వ్యవహరీస్తారని వర్దిల్లు తెలంగాణ, మంథని విద్యార్థి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు కొండేల మారుతి తెలిపారు.