Wednesday, January 15, 2025
Homeతెలంగాణఘనంగా జరిగిన వివేకానంద స్కూల్ వార్షికోత్సవం

ఘనంగా జరిగిన వివేకానంద స్కూల్ వార్షికోత్సవం

ఘనంగా జరిగిన వివేకానంద స్కూల్ వార్షికోత్సవం

సుల్తానాబాద్ మార్చి 25 కలం శ్రీ న్యూస్
సుల్తానాబాద్ వివేకానంద స్కూల్లో శనివారం పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుల్తానాబాద్
సీఐ ఇంద్రసేనారెడ్డి   విచ్చేసి విద్యార్థులు రానున్న రోజులలో మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. అలాగే సుల్తానాబాద్ ఎస్ఐ ఉపేందర్ రావు మాట్లాడుతూ విద్యార్థులు చాలామంది ఫోన్లకి అడిక్టై ఉన్నారని వారిని మార్చే బాధ్యత తల్లిదండ్రుల పైన ఉపాధ్యాయుల పైన ఉన్నదని అన్నారు.పాఠశాల ఫౌండర్ బాలకృష్ణ ప్రసాద్ పిల్లలను తల్లిదండ్రులను ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ రవీందర్ సుజాత పాఠశాల ప్రిన్సిపల్ మధు సూదన్ రెడ్డి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ చందు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కిరణ్ మరియు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు..
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!