మహిళా ఉద్యోగులకు బుధవారం సెలవు
హైదరాబాద్,మార్చి07(కలం శ్రీ న్యూస్) : అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Womens Day) సందర్భంగా మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ రోజున రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ సాధారణ సెలవు దినంగా ప్రకటించింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా సెర్ప్, మెప్మా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఈ నెల 8న రూ. 750 కోట్ల రుణాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.