సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం
వికారాబాద్,ఏప్రిల్8(కలం శ్రీ న్యూస్):సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోని వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది. సీఏం కాన్వాయ్ లోని వాహనం టైర్ పంక్చర్ అయ్యింది. కాన్వాయ్ లో ఉన్న ఒక ల్యాండ్ క్రూజర్ వాహనం టైర్ ఒక్కసారిగా పేలింది..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ వెళ్లే సమయంలో వికారాబాద్ జిల్లా మన్నెగూడా వద్ద ఈ ఘటన జరిగింది. దీంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. అక్కడ ఏం జరుగుతుందో అని షాక్ లో ఉండి పోయారు. టైర్ పేలిందని తెలియడంతో అందరూ వాహనాల నుంచి బయటకు వచ్చారు. పేలిన టైర్లు రిపేర్ చేయడంతో మళ్లీ వాహనాలు కొడంగల్ కు బయలుదేరాయి. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగక పోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఘటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మొయినాబాద్ మీదుగా కొడంగల్ మీటింగ్ కు బయలు దేరారు.