బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన ఎంపీపీ పాండు గౌడ్
మర్కుక్,మే14(కలం శ్రీ న్యూస్):మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన రుద్రారం సత్తమ్మ అదే గ్రామానికి చెందిన మొద్దు మణికంఠలు వేరు వేరు పరిస్థితిలో నిన్న రాత్రి చనిపోయారు.ఈ రోజు ఉదయమే మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం తక్షణ ఖర్చుల నిమిత్తం భాదిత కుటుంబాలకు సభ్యులకు నగదు సాయం అందించారు. వీరితో పాటుగా జుట్టు సుధాకర్, శ్రీగిరి పల్లి కృష్ణ, గిద్దల బిక్షపతి, సర్దాని స్వామి, వార్డు సభ్యులు రాజు, కుమ్మరి పోచయ్య, బాలనర్సు తదితరులు ఉన్నారు.