భార్యను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న భర్త
సంగారెడ్డి, జులై 22 (కలం శ్రీ న్యూస్): సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యను హత్య చేసి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డ భర్త.
ఈ ఘటన శనివారం జరిగింది. స్థానిక ఎస్ఐ రాజేశ్ నాయక్ వివరాల ప్రకారం.. పోతిరెడ్డి పల్లి కాలనీ వీకర్ సెక్షన్ లో నివాసం ఉంటున్న అల్లం యాదగిరి స్థానికంగా ప్లంబర్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. కాగా, శనివారం నాడు అతని భార్య యశోద ను యాదగిరి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం యాదగిరి ఇంట్లోని ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు ఈ సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలియజేశారు.