బర్రెలక్క పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
మహబూబ్ నగర్,నవంబర్ 21(కలం శ్రీ న్యూస్):తెలంగాణలో ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకుని చదువుకున్న జాబ్ లు రావడం లేదని, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే బదులు బర్రెలు కాయడం బెటర్ అంటూ శిరీష అనే ఓ నిరుద్యోగ యువతి బర్రెలక్కగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన విషయం తెలిసిందే. కాగా, నిరుద్యోగుల గొంతుకనవుతానంటూ బర్రెలక్క ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగింది.
మహబూబ్ నగర్‌లోని కొల్లాపూర్ నియోజకవర్గం నుండి బర్రెలక్క పోటీ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో శిరీష నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ బర్రెలక్క కొల్లాపూర్ పరిధిలోని పెద్ద కొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ప్రచారం నిర్వహించారు.
ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు బర్రెలక్కతో పాటు ఆమె ఆమె సోదరుడిపై దాడి చేశారు. దీంతో బర్రెలక్క కన్నీరు పెట్టుకుంది. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఓట్లు చీల్చుతాననే భయంతోనే తనపై దాడి చేశారని అన్నారు.తనపై దాడి చేసింది ఏ పార్టీ వారో తెలిదయన్నారు. రాజకీయాలు అంటేనే రౌడీయిజం అనేవారు.కానీ తాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానన్నారు. నిరుద్యోగుల కోసం పోరాడాటానికి వస్తే.. తనపై ఇలా దాడులు చేస్తున్నారని ఆమె బోరున విలపించారు. ఇప్పటి వరకు తనకు ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చిన తను ఎవరీ పేరు బయటపెట్టలేదన్నారు.
ప్రజాస్వామ్యంలో ఇలా దాడులు చేయడం సరికాదన్నారు. పోలీసులకు తమకు రక్షణ కల్పించాలని కోరారు…