కామారెడ్డి జిల్లాలో యువతి మృతదేహం లభ్యం
కామారెడ్డి,డిసెంబర్14(కలం శ్రీ న్యూస్):కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని భూ పంల్లి శివారులో ఓ యువతి దారుణహత్య కు గురైంది.సదాశివనగర్ సీఐ రామన్, ఎస్సై రాజు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సుమారు 16 నుంచి 20 ఏండ్ల వయస్సు గల యువతి హత్యకు గురైనట్టు తెలిసింది.యువతిని ఇక్కడే చంపారా? లేదా ఇతర ప్రాంతంతో చంపి ఇక్కడి తీసుకొచ్చి దహనం చేశారా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.కాళ్లు, చేతులు పూర్తిగా కాలిపోయాయని తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు.