శ్రీ వాగ్దేవి విద్యాలయం లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు……
మలహర్,సెప్టెంబర్05(కలం శ్రీ న్యూస్):మండల కేంద్రమైన తాడిచర్ల లోని శ్రీ వాగ్దేవి విద్యాలయం లో సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు పాఠశాల కరస్పాండెంట్ రాగం కుమార్ తెలిపారు.ఉపాధ్యాయునిగా వృత్తి చేపట్టిన రాధకృష్ణన్ మన భారత మొదటి ఉప రాష్ట్రపతి గా సేవలు అందజేసారు అని అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాఠశాల సిబ్బందిని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది వనిత,సంధ్య,లావణ్య,ఉష,మమత విద్యార్థులు పాల్గొన్నారు.