సాంస్కృతిక,చిత్రలేఖనం పోటీలలో ఐపీఎస్ విద్యార్థుల ప్రతిభ.
సుల్తానాబాద్,డిసెంబర్ 17 (కలం శ్రీ న్యూస్) : జిల్లా స్థాయి సాంస్కృతిక, చిత్రలేఖనం పోటీలలో ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు బహుమతులు సాధించారు.ఈ నెల 15 న గోదావరిఖని పట్టణం యైటింక్లయిన్ కాలనీలోని స్పందన మోడల్ స్కూల్ లో నిర్వహించిన జిల్లాస్థాయి సాంస్కృతిక, చిత్రలేఖనం పోటీలలో స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి మొదటి బహుమతులు అందుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్,ప్రిన్సిపల్ మాటేటి కృష్ణప్రియ మాట్లాడుతూ, ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచి జానపద నృత్యం, చిత్రలేఖనం పోటీలలో 3 మొదటి బహుమతులను పొందారని,విద్యార్థులకు కృతజ్ఞతాభినందనలు తెలుపుతున్నామని అన్నారు. చదువు, క్రీడలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో సైతం మా విద్యార్థులు ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.