జూల్లపల్లి పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరు భేష్.
రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి)
జూలపల్లి,డిసెంబర్12)కలం శ్రీ న్యూస్):
రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలోని జూలపల్లి పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్. తో కలిసి సందర్శించారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న సీపీ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. రిసెప్షన్ సందర్శించి రికార్డులు చెక్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల ఫిర్యాదుల విషయం లో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులు కు న్యాయం జరిగే విధంగా చూడాలనీ అన్నారు.అక్కడి సిబ్బంది తో మాట్లాడి వారు చేసే విధులలో ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడగడం జరిగింది. పోలీస్ స్టేషన్ రికార్డ్స్, పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, వారు చేస్తున్న విధులు, పని తీరు అని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి బౌగోలిక పరిస్థితులు, ఈ ప్రాంతం ఉన్న మావోయిస్టుల, కుటుంబ సభ్యుల వివరాలు, ఇక్కడ ఉండే ప్రజల గురించి, గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని వివరాలు ఎస్ఐ ని అడిగి తెలుసుకున్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకొని కొత్తగా వచ్చిన పోలీసు కానిస్టేబుల్ లను తక్కువ ఫోర్స్ ఉన్న పోలీస్ స్టేషన్ లకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి లా అండ్ ఆర్డర్, పొలిటికల్ సమస్యలు లేవు, నేరాలు కూడా గతం లో కంటే తగ్గడం జరిగింది అన్నారు.రాబోయే ఎన్నికల సంబందించి ఎస్ఐ, సిబ్బంది గ్రామాలను సందర్శించి సమస్యత్మక గ్రామాలు, ట్రబుల్ మంగర్స్ గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి గ్రామాలలోని ప్రజల సమస్యలు, ఫిర్యాదులు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించడం జరుగుతుంది అదేవిదంగా ప్రజల తో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకుని ప్రతిష్ట మైన ఇన్ఫర్మేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్నారు. అధికారులు, సిబ్బంది ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకుని శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూసుకోవాలని,స్టేషన్ రికార్డ్స్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని, అక్రమ రవాణా పై పూర్తి నిఘా ఉంచి నియంత్రించాలని , విజిబుల్ పోలీసింగ్ ను పెంచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ , సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ నరేష్ ఉన్నారు