Thursday, December 5, 2024
Homeతెలంగాణసుల్తానాబాద్ బిజెపి నాయకుల ముందస్తు అక్రమ అరెస్ట్

సుల్తానాబాద్ బిజెపి నాయకుల ముందస్తు అక్రమ అరెస్ట్

సుల్తానాబాద్ బిజెపి నాయకుల ముందస్తు అక్రమ అరెస్ట్

సుల్తానాబాద్,డిసెంబర్4(కలం శ్రీ న్యూస్):
పెద్దపల్లిలో జరుగుతున్న ప్రజాపాలన నిరుద్యోగ విజయోత్సవ బహిరంగ సభ ఏర్పాటు పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా కాలయాపన చేస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈవిషయాన్ని ప్రశ్నిస్తున్న బిజెపి, ప్రతిపక్ష పార్టీ నాయకుల గొంతునొక్కుతూ పెద్దపల్లిలో జరుగుతున్న కాంగ్రెస్ బహిరంగ సభకు ముందు రోజు అర్థరాత్రి సుల్తానాబాద్ బిజెపి నాయకులను, ఎబివిపి నాయకులను ముందస్తుగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సుల్తానాబాద్ బిజెపి అధ్యక్షులు కూకట్ల నాగరాజు మాట్లాడుతూ.. బిజెపి నాయకులను అక్రమ అరెస్ట్ లు చేసి నాయకులపై కేసులు నమోదు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంనికి సిగ్గుచేటు అని, అక్రమ అరెస్ట్ లకు భయపడే సమస్యే లేదని, వచ్చే ఎన్నికలలో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో సుల్తానాబాద్ మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షులు కూకట్ల నాగరాజు, పట్టణ ఉపాధ్యక్షులు ఎలవేని తిరుపతి, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు చిట్టవేని సదయ్య, బిజెపి బిజేవైఎం జిల్లా కార్యదర్శి బుర్ర సతీష్ గౌడ్, కిసాన్ మోర్చ జిల్లా కార్యదర్శి బొట్టు శేకర్ మాస్టర్, ఎబివిపి నగర కార్యదర్శి మెరుగు సిద్దార్థ, పట్టణ జాయింట్ సెక్రెటరీ పెరుక వినయ్, ప్రకాష్, తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!