అయ్యప్ప స్వామి ఆలయంలో కన్నుల పండువగా అభిషేక మహోత్సవం
సుల్తానాబాద్,డిసెంబర్4(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ మండల కేంద్రంలోని నీరుకుల్ల రోడ్ లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవార ఉదయం అర్చకులు రవీందర్ ఆచార్యుల సారధ్యంలో అయ్యప్ప స్వామి నామస్మరణ, సంకీర్తనలతో శరణు ఘోష చేస్తూ,స్వామివారికి పంచామృత సహిత ఫలాభిషేకం, అలంకారం, పుష్పార్చన, ధూప దీపం నైవేద్యం, మహా హారతి, మంత్రపుష్పం, ఆశీర్వచనము గావించి అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో భక్తులు, అయ్యప్ప మాలాధారులు, దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.