కాలుష్యం నియంత్రణకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలి
సుల్తానాబాద్,డిసెంబర్3(కలం శ్రీ న్యూస్):
కాలుష్యం నియంత్రణకు ప్రతి ఒక్కరు తోడ్పడాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెచ్.ఎస్.హెల్త్ సుపర్ వైజర్ రోజా అన్నారు. మంగళవారం కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంతో పాటు కాట్నపల్లి గ్రామంలోని ఇటుక బట్టీల వద్ద వాయు కాలుష్యం, నీటి కాలుష్యం వల్ల వచ్చే వ్యాధుల పట్ల కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కాలుష్యం వల్ల అనేక రోగాల బారిన కార్మికులు పడుతున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాలుష్యం వల్ల శ్వాస కోస వ్యాధులతో పాటు దగ్గు,ఆస్తమా లాంటి రోగాలు వస్తాయని, ప్రతిరోజు తప్పనిసరిగా కార్మికులు బెల్లం తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య పరిరక్షణ కోసం గ్రామాలలో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వెంకట్ రెడ్డి, ఏఎన్ఎం కవిత, ఆశ లావణ్య సహా పలువురు పాల్గొన్నారు