గర్రెపల్లి గ్రంథాలయానికి 72 పుస్తకాల పంపిణీ
సుల్తానాబాద్,నవంబర్28(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి లోని గ్రంథాలయానికి 72 పుస్తకాలను జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్ గురువారం గ్రంథాలయానికి అందజేశారు. బుధవారం గ్రంధాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్ గర్రెపల్లి గ్రంథాలయాన్ని సందర్శించగా, గర్రెపల్లి కి చెందిన నిరుద్యోగులు గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు పుస్తకాలు కావాలని చైర్మన్ ను అడగగా వెంటనే స్పందించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్ జిల్లా గ్రంధాల శాఖ ద్వారా పుస్తకాలను అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత నిత్యం గ్రంథాలయాలకు వెళ్లి పేపర్లను పుస్తకాలను గ్రూప్స్ సంబంధించిన పుస్తకాలను అన్ని అందుబాటులో ఉంచడం జరిగిందని, ప్రతి ఒక్కరు పాఠకులు వినియోగించుకోవాలని కోరారు.