Friday, December 27, 2024
Homeతెలంగాణఏసీబీకి చిక్కిన కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్

ఏసీబీకి చిక్కిన కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్

ఏసీబీకి చిక్కిన కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్

కాల్వ శ్రీరాంపూర్,ఆగష్టు03(కలం శ్రీ న్యూస్):

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో అవినీతి రెవెన్యూ అధికారులను ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని తహసిల్దార్ కార్యాలయంలో మందమర్రి కి చెందిన కాడం తిరుపతి అనే రైతు నుండి కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్ జాహిద్ పాషా, వీఆర్ఏ మల్లేశం కుమారుడు దాసరి విష్ణు, డ్రైవర్ అంజాద్ లు పదివేల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

పూర్తి వివరాల్లోకి వెళితే కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని పందిళ్ళ గ్రామ శివారు లోని సర్వే నంబర్ 645/అ లో 28 గుంటల భూమి కాడం మల్లయ్య పేరిట అన్ని ధ్రువపత్రాలు ఉన్నా కొందరు వ్యక్తులు కబ్జాకు పాల్పడడంతో వివాదం నెలకొంది. పెండింగ్ మోటేషన్ కోసం ఎన్నోసార్లు తహసిల్దార్ కార్యాలయం చుట్టూ మల్లయ్య కుమారుడు తిరుపతి తిరిగినా రెవెన్యూ అధికారులు స్పందించక పోవడంతో జిల్లా అధికారు లను కలవగా గత నెల 23న మోటేషన్ పూర్తయింది.గతంలో పలుమార్లు వీఆర్ ఏ మల్లేశం కుమారుడు విష్ణు కు ఫోన్ పే ద్వారా 15 వేల రూపాయలను తీసుకున్నారని, మరికొంత నగదు కావాలని తిరుపతిని రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురి చేయగా ఏసీబీ అధికారులను సంప్రదించగా ఈ మేరకు  శనివారం తిరుపతి నుండి నగదు తీసుకుంటుండగా తహసిల్దార్ జాహిద్  పాషా, వీఆర్ఏ మల్లేశం కుమారుడు విష్ణు, డ్రైవర్ అంజాద్ లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తనిఖీల్లో ఏసీబీ డిఎస్పి రమణమూర్తి, సిఐ కృష్ణకుమార్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!