భవిష్యత్తు లో ఇలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ కావొద్దు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్,జులై 17(కలం శ్రీ న్యూస్):
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లో కుక్కల దాడిలో మంగళవారం రాత్రి బాలుడు మృతి చెందిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు.
వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడం తనను కలిచివేసిందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. సిటీలో ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా వీధి కుక్కల బెడదను అరి క ట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నెంబర్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చిన్నారులపై వీధి కుక్కల దాడులను అరికట్టడానికి పశు వైద్యులు, బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. వీధి కుక్కల దాడి ఘటన లను నివారించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బస్తీలు, కాలనీలు, సంబంధిత వార్డు కమిటీల సహకారం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ అధికారులను సీఎం ఆదేశించారు.