Sunday, January 5, 2025
Homeతెలంగాణసెప్టిక్ ట్యాంక్ లో పడి చికిత్స పొందుతున్న బాలుడు మృతి

సెప్టిక్ ట్యాంక్ లో పడి చికిత్స పొందుతున్న బాలుడు మృతి

సెప్టిక్ ట్యాంక్ లో పడి చికిత్స పొందుతున్న బాలుడు మృతి

పెద్దపల్లి,జులై10(కలం శ్రీ న్యూస్):

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం సెప్టిక్ ట్యాంక్ లో పడి చికిత్స పొందుతున్న బాలుడు  బుధవారం ఉదయం మృతి చెందాడు. మంగళ వారం మహబూబాబాద్ కు చెందిన కూలీలు రాములమ్మ శ్రీనివాసుల ఏడేళ్ల కుమారుడు జాన్ వెస్లీ జిల్లా ప్రధాన ప్రభుత్వాసుపత్రి లోని సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం విధితమే. వెంటిలేటర్ పై ఉన్న బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు బంధువుల రోదనలు మిన్నంటాయి.బతుకుదెరువు కోసం వస్తే కడుపుకోత మిగిలిందని తల్లితండ్రులు వాపోయారు. ప్రభుత్వాసుపత్రిలో అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం వలన, సెప్టిక్ ట్యాంక్ హోల్ తెరిచి ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!