తైక్వాండో పోటీలో సుల్తానాబాద్ విద్యార్థికి గోల్డ్ మెడల్
చొప్పదండి,జులై6(కలం శ్రీ న్యూస్):
కరీంనగర్ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు చొప్పదండి మండల కేంద్రంలో గల ఎస్.ఆర్.ఆర్.కన్వెన్షన్ లో నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాల సుల్తానాబాద్ లో వృత్తి విద్యా కోర్సు మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి పెద్ది పార్ధు జూనియర్ విభాగంలో అండర్ 68 కిలో కేటగిరీలో గోల్డ్ మెడల్, పూమ్సే లో సిల్వర్ మెడల్ సాధించాడు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ కోశాధికారి జి.సంతోష్ ,కరీంనగర్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రెసిడెంట్ డి.మనోహర్ , వైస్ ప్రెసిడెంట్ పెండ్లి రాజేందర్ , జనరల్ సెక్రెటరీ ఎస్.సంతోష్ , పెద్దపెల్లి జిల్లా జనరల్ సెక్రెటరీ నేవూరి సతీష్ కుమార్ పాల్గొని పార్ధును అభినందించినట్లు గా సూర్య తైక్వాండో అకాడమి కోచ్ రాజేందర్ తెలియచేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మెహరాజ్ , ఉపన్యాసకులు, సిబ్బంది, విద్యార్థులు అభినందనలు తెలిపి భవిష్యత్తులో మరిన్ని పథకాలు గెలవాలని కోరారు.