Sunday, December 22, 2024
Homeతెలంగాణలయన్స్ క్లబ్ నూతన అధ్యక్షునిగా మాటేటి సంజీవ్ కుమార్

లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షునిగా మాటేటి సంజీవ్ కుమార్

లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షునిగా మాటేటి సంజీవ్ కుమార్

సుల్తానాబాద్, జూన్ 29 (కలం శ్రీ న్యూస్): సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షునిగా మాటేటి సంజీవ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ 23వ ప్రతిష్టాపన మహోత్సవం లో భాగంగా స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో శుక్రవారం సాయంత్రం పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూర్వ జిల్లా గవర్నర్ లయన్ చిదుర సురేష్ ,నూతన అధ్యక్షులుగా లయన్ మాటేటి సంజీవ్ కుమార్, కార్యదర్శిగా పిట్టల వెంకటేష్, కోశాధికారిగా పూసాల సాంబమూర్తి,ఇతర కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణం చేయించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి చిదుర సురేష్ మాట్లాడుతూ సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ద్వారా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేశారని, ఎంతోమంది పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, కంటిచూపు లేనివారికి ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేసి అంధులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించినారని అభినందించారు.అలాగే నూతనంగా ఎన్నికైన కార్యవర్గం మరిన్ని ఉత్తమ సేవలు చేస్తూ క్లబ్ యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించాలని కోరారు.అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ తనపై విశ్వాసంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న కాలంలో క్లబ్ సభ్యుల సమన్వయంతో చక్కటి సేవా కార్యక్రమాలను చేపడుతూ జిల్లాలోనే ఉత్తమ క్లబ్ గా తీర్చిదిద్దుతానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పూర్వ జిల్లా గవర్నర్ చిదుర సురేష్, రీజియన్ చైర్మన్ గాలిపెల్లి వెంకట్, జోన్ చైర్మన్ వేముల విష్ణుమూర్తి, జి..ఎల్.టి మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, జిల్లా కో-ఆర్డినేటర్లు వలస నీలయ్య, మాటేటి శ్రీనివాస్, జూలూరి అశోక్, కొండ రాంబాబు, సుధాకర్, కార్యవర్గ సభ్యులు దీకొండ భూమేష్, గజభీంకార్ జగన్, నవీన్, సంపత్ నూతనంగా చేరిన 10 మంది సభ్యులతో పాటు పాఠశాల డైరెక్టర్ క్రిష్ణప్రియ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!