బేబి సహస్ర కు నివాళులర్పించిన జాతీయ మానవ హక్కుల కమిటీ.
కొవ్వొత్తులతో ఘన నివాళి.
సుల్తానాబాద్,జూన్ 18,(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ పట్టణంలో జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా కమిటీ అధ్యక్షులు పూసాల కృష్ణ, సుల్తానాబాద్ మండల అధ్యక్షులు మహమ్మద్ యూసుఫ్ ఆధ్వర్యంలో బేబీ సహస్రకు ఘన నివాళులర్పించారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో బేబీ సహస్రకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య మాట్లాడుతూ బేబీ సహస్ర పై జరిగిన ఆ మానవీయ సంఘటనను ఖండిస్తూ పసిపిల్లలను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.ఈ సందర్భంగా పోలీసుల పాత్రను ప్రశంసించారు. సంఘటన జరిగిన అతి తక్కువ సమయంలోనే పోలీసులు చాకచక్యంగా నిందితుడిని పట్టుకోవడంతో పాటు కేసు నమోదు చేసుకోవడం అభినందనీయమని అన్నారు. ముక్కుపచ్చలారని చిన్నారిపై ఆకృత్యానికి పాల్పడిన దోషిని వెంటనే కఠినంగా శిక్షించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ రామగుండం సి.పి లకు విజ్ఞప్తి చేశారు. గతంలో పోలీసు ఉన్నతాధికారి సజ్జనార్ స్పందించిన విధంగా స్పందిస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అధికారులకు సూచించారు. మంత్రులు హామీ ఇచ్చిన విధంగా చిన్నారి కుటుంబంలో వెంటనే ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు.సోమవారం రోజు ఏ.సి.పి.గజ్జి కృష్ణ చేసిన సూచనల మేరకు రైస్ మిల్లర్ యజమానులు వలస కూలీల కుటుంబాలకు గృహాలను విడిగా కల్పించాలని, వలస కూలీల రక్షణ బాధ్యత ను కూడా నిర్వర్తించాలని విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. రైస్ మిల్లర్ యజమానులు ఈ సూచనలను వీలయినంత త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.కనీస వసతులు అమలు చేయని పక్షంలో కార్మికుల తరపు నుంచి గళం వినిపిస్తామని అన్నారు.వలస కార్మికులకు సరైన వసతులు సమకూర్చకుండా, మానవ హక్కులను లెక్కచేయకుండా,అమానవీయంగా శ్రమ దోపిడి చేస్తున్న రైస్ మిల్, ఇటుక బట్టి యజమానుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. బేబి సహస్ర లాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై పాటు రైస్ మిల్లర్ ఇటుక కార్మికుల ఇటుక బట్టీలు యజమానులపై ఉందని అన్నారు. బాధిత కుటుంబానికి చేసిన హామీలు అమలు జరిగాయో లేదో తెలుసుకునేందుకు బాధిత కుటుంబాలను కలుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య, జోనల్ కమిటీ కో కన్వీనర్ ఇంజం సాంబశివరావు, పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి బూర్ల వంశీ,ప్రచార కార్యదర్శి కొత్త కమలాకర్, జాయింట్ సెక్రటరీ బొడ్డుపల్లి సదయ్య, సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు యూసుఫ్ ,పెద్దపల్లి మండల అధ్యక్షుడు హరిబాబు, జనరల్ సెక్రెటరీ బొడ్డుపల్లి కనకయ్య, జులపెల్లి మండల అధ్యక్షుడు తిరుపతి, కమాన్ పూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, రామగిరి మండల అధ్యక్షుడు శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ రాజు,మంథని మండల అధ్యక్షులు రమేష్, కల్లిపెల్లి కుమార్,అడపా బాపూరెడ్డి, సమీర్, బొజ్జ క్రాంతి, రమేశ్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.