రామగుండం -మణుగూరు రైల్వే కోల్ కారిడార్‌కు గ్రీన్ సిగ్నల్
రామగుండం, మే 23(కలం శ్రీ న్యూస్):
రామగుండం, మణుగూరు రైల్వే స్టేషన్ ల మధ్య ప్రత్యేక రైల్వే కోర్ కారిడార్ ఏర్పాటు కు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.ఇందుకోసం భూసేకరణ చేపట్టాలని ఆదేశించింది. సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాల్ని కలుపుతూ నిర్మించే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,911కోట్లుగా ఉంది.ప్రస్తుతం బొగ్గును కాజీపేట మీదుగా రవాణా చేస్తు న్నారు. ఈ కొత్త లైన్ నిర్మాణం వల్ల దూరంతో పాటు బొగ్గు రవాణా వ్యయం కూడా తగ్గనుంది.