Wednesday, September 18, 2024
Homeతెలంగాణబెట్టింగ్ లో 2 కోట్లు పోగొట్టాడని కన్న కొడుకును రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి

బెట్టింగ్ లో 2 కోట్లు పోగొట్టాడని కన్న కొడుకును రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి

బెట్టింగ్ లో 2 కోట్లు పోగొట్టాడని కన్న కొడుకును రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి

మెదక్, మే12(కలం శ్రీ న్యూస్):మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లికి చెందిన ముకేశ్‌ కుమార్‌ (28) ముకేశ్‌ చేగుంట మండలం మల్యాలలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.అతను ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, జల్సాలకు అలవాటు పడ్డాడు.ఇది గమనించిన తండ్రి సత్యనారాయణ అలవాటు మానుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు.అయినా పద్ధతి మార్చుకోని ముకేశ్‌ ఇప్పటి వరకూ రూ.2 కోట్ల వరకు డబ్బులు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో పొగొట్టాడు.ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోని కొడుకుపై ఆ తండ్రికి పట్టరాని కోపం వచ్చింది.ఈ క్రమంలో శనివారం రాత్రి కుమారుడు ముకేశ్‌పై తండ్రి సత్యనారాయణ దాడి చేశాడు.కుమారుడి తలపై ఇనుప రాడ్డుతో బలంగా కొట్టడంతో తీవ్రగాయాల పాలైన ముకేశ్‌ కుమార్ మృతి చెందాడు.మేడ్చల్‌లో ఉన్న ఇళ్లు, ప్లాటు బెట్టింగ్‌ కారణంగా అమ్మేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.మృతుడు కౌశిక్‌కు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారమే తండ్రీ కుమారుల మధ్య గొడవకు దారితీసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!