Saturday, July 27, 2024
Homeతెలంగాణదివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి.

దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి.

దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి.

మంథని, మే 10(కలం శ్రీ న్యూస్):
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది దివ్యాంగుల కొరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, రాష్ట్ర ఐ. టి. శాఖ మంత్రి  శ్రీధర్ బాబు కి వికలాంగుల నెట్వర్క్ రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులు, పెద్దపల్లి జిల్లా కన్వీనర్ ఇనుముల సతీష్ వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ  ఆ కాంగ్రెస్ పార్టీ జాతీయ మ్యానిఫెస్టో లో దివ్యాంగుల సాధికారత, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తామని, వారి మనోభావాలు గౌరవిస్తూ స్థానిక ఎన్నికల్లో 5 శాతం రిజర్వేషన్ లు కల్పిస్తామని మ్యానిఫెస్టో లోని 8వ పేజీలోని 8 వ అంశంగా చేర్చడం పట్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి దివ్యాంగుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.

అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 5 శాతం రిజర్వేషన్లు ఇప్పటికే రాజస్తాన్, ఛత్తిష్ గడ్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని, అదేవిధంగా తెలంగాణ రాష్టంలో కూడా ముఖ్యమంత్రి  ఇతర మంత్రివర్గ సభ్యుల సహకారంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేసే విధంగా మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ హోదాలో చర్యలు తీసుకొని తెలంగాణ రాష్టంలో ఉన్న లక్షలాది మంది దివ్యాంగులకు రాజకీయాల్లో మానసిక ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని ఆ వినతిపత్రంలో కోరడం జరిగింది.అందుకు గాను సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని మంత్రి తెలిపినందుకు వారికి తెలంగాణ వికలాంగుల నెట్వర్క్ సంస్థ తరపున ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!