Tuesday, October 8, 2024
Homeతెలంగాణకాంగ్రెస్ పార్టీలో చేరిన విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు

కాంగ్రెస్ పార్టీలో చేరిన విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు

కాంగ్రెస్ పార్టీలో చేరిన విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు
మంథని, మే 08(కలం శ్రీ న్యూస్):
మంథని మున్సిపల్ పరిధిలోని 7వ వార్డుకు చెందిన దాదాపు 200 మంది విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు, కుల సోదర సోదరీమణులు రాష్ట్ర మంత్రి, జననేత, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో బుదవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 7వ వార్డు విశ్వ బ్రాహ్మణ వీధిలో ఏర్పాటు చేసిన సభలో వారందరికీ మంత్రి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వయంగా ఆహ్వానించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ముగియగానే వార్డులో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతామని, విశ్వ బ్రాహ్మణ సంఘం అభివృద్ధి కొరకు సహకారం అందిస్తామని, చదువుకున్న యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మంథని విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గర్రెపల్లి రాజవీరు, సదానందం, నందం, సమ్మయ్య,రమేష్, మోహన్ తదితరులతో పాటు 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంబోజు సమ్మయ్య ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వార్డుకు సంబంధించిన విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు, పెద్ద మనుషులు,మహిళా సోదరీమణులు, యువకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

కాగా ఈ కార్యక్రమానికి 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇనుముల సతీష్ అధ్యక్షత వహించగా, మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ సీపతి బానయ్య,
ప్రచార కమిటీ కన్వీనర్ వొడ్నాల శ్రీనివాస్, ఎంపిపి కొండ శంకర్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, కౌన్సిలర్లు వి. కె. రవి, చొప్పకట్ల హనుమంతు, కుర్ర లింగయ్య, గుండా విజయలక్ష్మి- పాపారావు , కొట్టె పద్మ- రమేష్ , నక్క నాగేంద్ర – శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీరాంబట్ల సంతోషిణి, మూల సరోజన, అజీమ్ ఖాన్,ముస్కుల సురేందర్ రెడ్డి,బండారి ప్రసాద్,7వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్పాక నిహారిక, మంథని సురేష్, అంకూస్, అక్బర్, అయిటిపాముల సదానందం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!