Friday, September 20, 2024
Homeతెలంగాణబిఆర్ఎస్ పార్టీ మండలం నాయకత్వానికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా  చేసిన పురం ప్రేమ్ చందర్

బిఆర్ఎస్ పార్టీ మండలం నాయకత్వానికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా  చేసిన పురం ప్రేమ్ చందర్

బిఆర్ఎస్ పార్టీ మండలం నాయకత్వానికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా  చేసిన పురం ప్రేమ్ చందర్

సుల్తానాబాద్,ఏప్రిల్29(కలం శ్రీ న్యూస్)

పెద్దపల్లి నియోజకవర్గ నాయకుడు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి  వ్యవహార శైలి నచ్చక ,రాష్ట్ర నాయకత్వం వ్యవహార తీరు నచ్చక పార్టీకి రాజీనామా,గత 10 సంవత్సరాల నుండి పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ మండలం లో పార్టీ బలోపేతానికి శక్తివంతన లేకుండా కృషి చేస్తున్నటువంటి నాలాంటి వ్యక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ప్రోత్సహించకపోవడం మండల నాయకత్వాన్ని కూడా చిన్నచూపు చూడడం అంతేకాకుండా మండల స్థాయిలో గ్రామస్థాయిలో ఉన్నటువంటి పార్టీ నాయకుల మనోభావాలతో పాటు… ఆర్థిక మూలాలను కూడా దెబ్బతీసే విధంగా యూస్ అండ్ త్రో  లాగా మెదులుతున్న దాసరి పట్ల మనోవేదనకు గురై రాజీనామా చేయడం జరుగుతున్నదని, నేను గత 30 సంవత్సరాల నుండి రాజకీయ వ్యవస్థలో ఉంటూ ఇలాంటి నాయకున్ని గతంలో ఎన్నడూ చూడలేదని,నేను మండలంలో గ్రామస్థాయిలో కార్యకర్తలను సమన్వయ పరుస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో గత మూడు శాసనసభ ఎన్నికల్లో కష్టనష్టాలను భరించి దాసరి ఎన్నిక కొరకు పాటుపడితే ఏనాడు కూడా మా కష్టాన్ని గుర్తించకపోవడమే కాకుండా తన వద్దకు వెళితే చిన్నచూపు చూడడం మనసు విప్పి మాట్లాడకపోవడం శరీరం ఒకచోట మనసు ఆలోచన మరోచోట ఉండే విధంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి దాసరి.. ఇది రాజకీయ లక్షణం అనిపించుకోదు. గత పది సంవత్సరాలుగా రెండు పర్యాయములు ఎమ్మెల్యేగా ఉండి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకునికి పనికి వచ్చినటువంటి సంఘటనలు లేవు. గ్రామస్థాయిలో ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు ఏదన్న పని చేస్తామంటే సహకరించక పోవడం గ్రామంలో స్ట్రీట్ లైట్ వచ్చిందంటే తనే పంపించడం..ఒక బోర్వెల్ వచ్చిందంటే ఆ బోర్వెల్ రికార్డు తనే చేయించుకోవడం చూస్తుంటే ఏ ఒక్క నాయకునికి సహకరించకుండా ఆర్థిక మూలాలను దెబ్బతీసినటువంటి మహానాయకుడు దాసరి ని ఇంతకాలం భరిస్తూ రావడం జరిగింది ..తను ఓడిపోయి నాలుగు మాసాలు గడిచిన ఏ ఒక్క వ్యక్తితో మాట్లాడడం గానీ పార్టీ ముందుకు పోయే విధానం గురించి చర్చించలేదు.. తను ఎమ్మెల్యే ఉన్న కాలంలో నియోజకవర్గ ఎంపీని గాని మంత్రిని గాని అదేవిధంగా పార్టీ అధ్యక్షులు గాని నియోజకవర్గంనకు రానీయకుండా తనే మోనార్క్ గా ఉంటూ పై నాయకులకు – మండల గ్రామ నాయకులకు పరిచయాలు కూడా లేకుండా చేసినటువంటి మహానుభావుడు దాసరి… ఈనాడు ఒక మాజీ మంత్రి ( ప్రస్తుత టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి) ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి కొప్పుల ఈశ్వర్ కి పెద్దపల్లి నియోజకవర్గంలో మండల స్థాయి నాయకులు ఎంత మంది తెలుసు.. మండలానికి వస్తే పార్టీ మండల అధ్యక్షుడు వారికి తెలవదు… ఇతర నాయకులు అసలే తెలవదు.. దీని కారణం దాసరి… ఏ ఒక్కనాడు కూడా నాయకత్వానికి పరిచయం చేయించక పోవడం ప్రతి విషయం తన ద్వారనే జరగాలని చూడడం మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులను కూడ కలవనీయకపోవడం.. ఒక మండలంలో ఉన్నటువంటి నాయకునికి తను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో కనీసం పోలీస్ స్టేషన్ లో గాని ఎమ్మార్వో ఆఫీస్ లో కానీ ఇతర మండల శాఖలో ఏ ఒక్క పని జరిగినటువంటి పరిస్థితి.. ఈనాడు తను ఓడిపోయి ఉండి నేనే ఓడిపోయిన తర్వాత మరొకరి గురించి నాకెందుకు అనే విధంగా వ్యవహరిస్తూ పార్టీ గురించి గానీ నాయకుని గురించి గానీ ఈ ఎంపీ ఎన్నికల్లో దాసరి ఎవరితోనూ కూడా మాట్లాడ లేదు..ఏదో నియోజకవర్గంలో తిరిగినా అంటే తిరిగిన.. వచ్చినమా వచ్చినం … అనే తీరు ప్రదర్శిస్తూ పార్టీ ఉనికిని దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి.. రెండు మాసాల క్రితం రెండు పర్యాయాలు రాష్ట్రం నుండి పార్టీ టీం నియోజకవర్గ అభిప్రాయం గురించి వచ్చినప్పుడు దాసరి వ్యవహరిస్తున్న శైలి గురించి చెప్పడమే కాకుండా వెంటనే పెద్దపల్లి నియోజకవర్గంలో ఇన్చార్జిన్ మార్పు చేస్తూనే పార్టీ బతుకుతుంది లేకుంటే పార్టీ ఉనికి దెబ్బ తింటుంది ..అని చెప్పడం జరిగింది …కానీ అలాంటిది లేకపోవడమే కాకుండా ఈనాడు స్వార్థ నాయకుని చేతిలో పార్టీని ఉంచి ముందుకు పోవాలంటే చాలా కష్టంగా ఉంది ..ఈనాడు గ్రామంలో మండలంలో ఉన్నటువంటి నాయకులు గత శాసనసభ ఎన్నికల్లో మీరు ఖర్చు చేయండి నేను తర్వాత తప్పకుండా ఇస్తాను అని అనడంతో కొంతమంది చిన్న చిన్న నాయకులు తమ శక్తికి మించి డబ్బు ఖర్చు చేస్తే నాలుగు మాసాలు గడిచిన వారికి డబ్బు ఇవ్వకపోవడమే కాకుండా వారిని మనోవేదనకు గురి చేస్తున్నారు… ఒక ఎమ్మెల్యేగా ఉండి పుట్టెడు అబద్ధాలు… నియోజకవర్గంలో తాను ఒక్కడే తప్ప ఇతరులు ఎవరూ బతకకూడదని రీతిలో ఇసుక మట్టి ఇటుక కాకుండా అధికారులను బెదిరించి కూడా డబ్బులు వసూలు చేసినటువంటి మహానాయకుడు దాసరి.. ఇలాంటి ఆరోపణలు పార్టీకి సంబంధించిన నాయకులే కాకుండా ప్రతిపక్ష నాయకులు గతంలో పలుమార్లు ఆరోపించడం జరిగింది.. అయన రాష్ట్ర నాయకత్వం పట్టించుకోలేదు… ఈనాడు నియోజకవర్గంలో పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి కార్యకర్తలు అనేక మంది ఉన్నారు.. కానీ నాయకత్వం నాయకుని పట్ల విశ్వాసం లేకపోవడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.. మండలంలో ఒకలిద్దరూ స్వార్థపరులను దగ్గర పెట్టుకొని వారు చెప్పిందే వేదం అనే రీతిలో ప్రవర్తిస్తూ ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం.. ఇలాంటి నాయకులు… నాయకత్వం ఉన్నంతవరకు పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని ఎదగరు.. రాష్ట్ర నాయకత్వానికి ఈ విషయాలన్నీ కూడా తెలిసి నాయకత్వాన్ని మార్చకపోవడం చాలా తప్పు. ఇలాంటి పొరపాట్లు వల్లనే ఈనాడు రాష్ట్రంలో పార్టీ మనుగడ దెబ్బతింటుంది… కార్యకర్తలు ఎంతో మనోవేదనకు గురి అవుతున్నారు… ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కష్టపడ్డ కార్యకర్తలను పక్కనపెట్టి వారి కష్టసుఖాలు తెలుసుకోకుండా స్వార్థ బుద్ధితో కార్యకర్తలను తొక్కి పెట్టాలని చూడడం ఎంతవరకు మంచిది…కార్యకర్తలు కష్టపడితేనే నాయకుడు అవుతాడు..ఆ నాయకుడు కార్యకర్తలను విస్మరిస్తే ఏమి జరుగుతుందో… అది జరుగుతుంది.. గ్రహించాలి…
అంకితభావంతో పనిచేసిన పార్టీ కార్యకర్తలకు నా అభినందనలు, దయచేసి మీకు ఒకటే మనవి చేస్తున్నాను నాయకుడు 100% స్వార్థ బుద్ధితో పనిచేస్తే కార్యకర్తలు లేకుండా పోతారు. కానీ అదే నాయకుడు కొంత స్వార్థంతో కొంత ఇతరుల అభ్యున్నతికి పాటుపడితే అది నాయకత్వ లక్షణం అవుతుంది.. ఈనాడు ఇప్పటికీ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు.. గత శాసనసభ ఎన్నికల్లో కొంతమంది ద్రోహం చేసిన కొంతమంది ఏకాగ్రతతో పని చేసినటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నారు… వారికి నా అభినందనలు తెలియజేస్తూ నేను ఈ పార్టీ కి రాజీనామా చేస్తున్నాను అని పురం ప్రేమ్ చందర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!