Wednesday, September 18, 2024
Homeతెలంగాణజూనియర్ సివిల్ జడ్జి ప్రియాంక బదలీ

జూనియర్ సివిల్ జడ్జి ప్రియాంక బదలీ

జూనియర్ సివిల్ జడ్జి ప్రియాంక బదలీ

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు

సుల్తానాబాద్,ఏప్రిల్ 27(కలం శ్రీ న్యూస్):

సుల్తానాబాద్ మున్సిపల్ లో జూనియర్ గా పనిచేసి మేడ్చల్ జిల్లా కూకట్ పల్లి రెండవ అదనపు 13వ మెట్రో పాలిటన్ కోర్టు కు బదిలీ పై వెళ్తున్న సందర్భంగా సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు జడ్జి ప్రియాంకకు ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పడాల శ్రీరాములు అధ్యక్షతన జరిగిన సన్మాన సభలో జడ్జి ప్రియాంక మాట్లాడుతూ సుల్తానాబాద్ కోర్టు లో గత సంవత్సరం ఆరు నెలలుగా జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసి లోక్ అదాలత్ ల ద్వారా ఇరు వర్గాలకు సమన్యాయం అందించి కేసులను పరిష్కరించడం సంతృప్తినిచ్చిందని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించబడ్డాయని అన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు జడ్జి ప్రియాంక ను పూలమలలు, శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపిక బహుకరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జోగుల రమేష్, ఏపీపీ శ్యాంసుందర్ రావు, ఏజిపి మేకల తిరుపతిరెడ్డి, న్యాయవాదులు టీ.కే.సత్యనారాయణ, ఆవుల లక్ష్మీరాజం, పబ్బతి లక్ష్మీకాంతరెడ్డి, ఆకారపు సరోత్తం రెడ్డి, భూసారపు బాలకిషన్ ప్రసాద్, మాడూరి ఆంజనేయులు, వోడ్నాల రవీందర్, పెగడ శ్యాం సుందర్, అవునూరి సత్యనారాయణ, దూడం అంజనేయులు, బోయినీ భూమయ్య, ఆవునూరి సత్యనారాయణ, కోడం అజయ్, సామల రాజేంద్రప్రసాద్, ఆవుల శివకృష్ణ, చిలుక ఆనంద్, చీకటి సంతోష్, మల్యాల కరుణాకర్ తో పాటు పలువురు న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!