గోశాల షెడ్డు నిర్మాణానికి 50వేల రూపాయల సహాయం
సుల్తానాబాద్,ఏప్రిల్23(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ లోని గోశాల షెడ్డు నిర్మాణానికి 50వేల రూపాయల సహాయం అందించిన సామాజిక కార్యకర్తలు అల్లం భాగ్యలక్ష్మి సత్యనారాయణ. సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీ పెరిగిద్ద హనుమాన్ దేవాలయం వద్ద గల శ్రీ ధర్మశాస్త్ర గోశాల కు షెడ్డు నిర్మాణం కోసమై సుల్తానాబాద్ పట్టణం గాంధీనగర్ కు చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు సామాజిక కార్యకర్తలు అల్లం భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతులు షెడ్డు నిర్మాణం కోసమే 50వేల రూపాయలు నగదు అందించడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆవులు ఎండాకాలం కాబట్టి తీవ్ర ఇబ్బంది పడుతున్నాయని మా దృష్టికి గోశాల వారు తీసుకురాగానే షెడ్డు నిర్మాణం కోసమే మా వంతుగా 50వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని, అలాగనే గోమాతలో 33 వేల దేవతలు కొలువుతీరి ఉంటారని, గోమాతను ఒక్కదాన్ని పూజిస్తే సర్వ దేవతను పూజించినట్టేనని సుల్తానాబాద్ పట్టణంలో ఈ గోశాల ఉండడం చాలా అదృష్టమని ఆ గోవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని కాబట్టి ఆ షెడ్డు నిర్మాణానికి తమ వంతుగా ఎంతో అంత సహాయ సహకారాలు అందించి ఆ గోమాత ఆశీస్సులు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ ధర్మశాస్త్ర గోశాల వ్యవస్థాపక అధ్యక్షులు బండారి సూర్యం, యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ పాల్గొన్నారు