సుల్తానాబాద్ మున్సిపాలిటీలో బూత్ నంబర్ 213లో బిజెపి ప్రచారం
సుల్తానాబాద్,ఏప్రిల్21(కలం శ్రీ న్యూస్):
భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ మున్సిపాలిటీలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ పిలుపు మేరకు సుల్తానాబాద్ మున్సిపాలిటీ బూత్ నంబర్ 213 శాస్త్రినగర్ లో బూత్ అధ్యక్షులు బుసారపు సంపత్, బిజెవైఏం జిల్లా కార్యదర్శి బుర్ర సతీష్ గౌడ్, పట్టణ ఓబిసీ మొర్చా అధ్యక్షులు మారవేనీ రమేష్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మున్సిపాలిటీ అధ్యక్షులు కూకట్ల నాగరాజు అధ్యక్షతన బిజెపి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ ను అధిక మెజారిటీతో పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ దేశానికి చేసిన సేవలను, కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ… మూడవ సారి నరేంద్ర మోడీ ప్రధాని కావాలని పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని పెద్దపల్లి లో బిజెపి గెలువాలని కోరుతూ.. బిజెపి కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బూసరపు సంపత్, పట్టణ ప్రధాన కార్యదర్శి గజభింకర్ పవన్, గుడ్ల వెంకటేష్, ఉపాధ్యక్షులు పల్లె తిరుపతి, కార్యదర్శులు పోచంపల్లి ఈశ్వర్, మహిళా బిజెపి కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.