ఘనంగా పూసాల లో బొడ్రాయి వేడుకలు
పోచమ్మ తల్లి బోనం ఎత్తిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
సుల్తానాబాద్, ఏప్రిల్20(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పూసాలలో భూలక్ష్మి, మహాలక్ష్మి, గ్రామశీల బొడ్రాయి,పోచమ్మ తల్లి బోనాలు గ్రామంలోని భిన్న కుల సంఘాల ప్రజలు భారీ ఎత్తున రెండు వేల మంది మహిళలు ఊరేగింపుగా రావడం జరిగింది.పోచమ్మ తల్లి కి బోనాలు సమర్పించి, బైండ్ల వారిచే పట్నం వేసి, గావు. పట్టిన అనంతరం నైవేద్యం సమర్పించి మహిళలు బోనం తీసుకువెళ్లడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మీ, రాజమల్లు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్నప్పుడు గ్రామ దేవతలే తమను కష్టనష్టాల నుంచి కాపాడుతారని ప్రజలు అమ్మవార్లకు ప్రతీకగా ఊరి మధ్యలో బొడ్రాయిని ఏటా కొలుపులు, పూజలు అభిషేకాలు బోనాలు సమర్పిస్తారని అన్నారు. ఆ సమయంలో ఊరంతా ఏకమై కులమతాలకు అతీతంగా జాతర జరుపుతారని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అమ్మవార్ల దీవెనలతో గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో పాడిపంటలతో సువిశాలంగా ఉండాలని కోరారు.