Saturday, July 27, 2024
Homeతెలంగాణజోరుగా సాగుతున్న బెల్ట్ షాపుల దందా

జోరుగా సాగుతున్న బెల్ట్ షాపుల దందా

జోరుగా సాగుతున్న బెల్ట్ షాపుల దందా

24×7 లెక్కన జరుగుతున్న దందా.

 వైన్ షాపుల అనుబంధంగా నడుస్తున్న దందా

చూసి చూడనట్టుగా మెదులుతున్న సంబంధిత శాఖ అధికారులు

సుల్తానాబాద్,ఏప్రిల్ 19(కలం శ్రీ న్యూస్): సుల్తానాబాద్ పట్టణంలో అలాగే చుట్టుపక్కల గ్రామాలలో జోరుగా బెల్ట్ షాపుల దందా సాగుతోంది. మండల కేంద్రంలో పూసాల, నీరుకుల్ల, గట్టేపల్లి, కాట్నపల్లి, కనుకుల, మద్దికుంట, దుబ్బ పల్లి, గర్రెపల్లి, సుగ్లాంపల్లి ఇలా దాదాపు అన్ని గ్రామాలలో అనుమతులు లేని ఈ బెల్టు షాపు లను కొందరు వ్యాపారులు యదేచ్ఛగా నడుపుతున్నారు. ఎలాంటి అనుమతులు, ఎక్సైజ్ శాఖ నిబంధనలు లేకుండా బెల్ట్ షాపులు మండలంలో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మండలంలో దాదాపు అన్ని గ్రామాలలో పట్టపగలే జరుగుతున్న ఈ దందాకు కళ్లెం వేసే నాధుడే కరువయ్యాడు. అదీకాక బెల్ట్ షాపుల్లో రోజులో పగలు, రాత్రి అనే తేేడా లేకుండా, ఎప్పుడైైనా మద్యం తాగడానికి అనువుగా ఉంటుందని, ఇక్కడ తినడానికి స్టఫ్, సిగరెట్టు, గుట్కా కూడా లభిస్తుందని మందుబాబులు అంటున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని బెల్టు షాపు నిర్వాహకులు తెలివిగా క్వార్టర్ బ్రాందీ, బీరు సీసా కు 20 నుండి 30 రూపాయల ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు.

బెల్టుషాపులే కాక హోటల్లు, దాబాల్లో మద్యం ఏరులై పారుతుంది. ఆయా గ్రామాల్లో వివిధ కాలనీల్లో కుటుంబ నివాసాల మధ్య ఈ బెల్టు షాపులు ఉండడంవల్ల పగలు, రాత్రి అనేే తేడా లేకుండా మద్యం లభించడంతో, మద్యం సేవించిన వారి చర్యల వలన చుట్టుపక్కల ప్రజలు మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ ఇలా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని కొందరు వాపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి బెల్టుషాపులను మూసివేయాలని పలువురు కోరుతున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!