కాంగ్రెస్ లో చేరిన జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు
సుల్తానాబాద్,ఏప్రిల్15(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ పట్టణానికి చెందిన జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షురాలు పల్లా అపర్ణ, మాజీ ఎంపీటీసీ పల్లా సురేష్ సోమవారం పెద్దపల్లి లో జరిగిన సమావేశంలో శ్రీధర్ బాబు సమక్షంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మినుపాల స్వరూప ప్రకాష్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, వైస్ చైర్మన్ బిరుదు సమతా కృష్ణ, కాంగ్రెస్ శ్రేణులు అంతటి అన్నయ్య గౌడ్, అబ్బయ్య గౌడ్, శ్రీగిరి శ్రీనివాస్, కుమార్ కిషోర్, స్థానిక కౌన్సిలర్లు, కాంగ్రెస్ శ్రేణులు నాయకులు పాల్గొన్నారు