పెద్దపల్లి లో భారాస పార్టీ కి షాక్….
పలు పార్టీ నాయకులు కాంగ్రెస్ లో చేరిక
పెద్దపల్లి,ఏప్రిల్ 15(కలం శ్రీ న్యూస్): పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలోకి పలు పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో చేరారు. ఇద్దరు జడ్పిటిసి లతో పాటు భారాస, బీఎస్పీ పార్టీల నుండి పలువురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్వరూప గార్డెన్స్ లో పార్లమెంటు ఎన్నికల సమావేశంలో ఎమ్మెల్యే విజయ రమణ రావు ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ గూటికి చేరారు. పెద్దపల్లి జడ్పిటిసి బండారి రామ్మూర్తి, జూలపల్లి జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్, పెద్దపల్లి సహకార సంఘం చైర్మన్ మాదిరెడ్డి నరసింహారెడ్డి, కాల్వ శ్రీరాంపూర్ చైర్మన్ చంద్రారెడ్డి, పెద్దపల్లి పురపాలక కౌన్సిలర్ లు రమాదేవి, అష్రఫ్ లతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.