Wednesday, May 29, 2024
Homeతెలంగాణ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు...

 శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు…

 శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు.
 తెలుగు పంచాంగం ప్రకారం.. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి.. ఆదాయం, ఆరోగ్యం, కుటుంబం, కెరీర్, విద్యా, వివాహ పరంగా ఎలా ఉంటుందో చూద్దాం..
మేషం: లాభ స్థానంలో సంచారం చేస్తున్న లాభస్థానాధిపతి శనీశ్వరుడు ఈ ఏడాదంతా యోగప్రదంగా ఉంటాడు. ఏప్రిల్ 30 తర్వాత నుంచి గురువు ధన స్థానమైన వృషభంలో సంచారం ప్రారంభిస్తాడు. రాహు కేతువులు పన్నెండు, ఆరు స్థానంలో బాగా అనుకూలంగా ఉన్నారు. మొత్తం మీద ప్రధాన గ్రహాలన్నీ శుభప్రదంగా ఉన్నందువల్ల ఈ సంవత్సరమంతా అనేక విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. జీతభత్యాలు, ప్రమోషన్ వంటి విషయాలకు సంబంధించి శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగానే ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృథా ఖర్చులకు కళ్లెం వేస్తారు. ఇష్టమైన పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు ఒకటి రెండు పరిష్కారం అవుతాయి. ఉద్యోగం మారడం గానీ, ఉద్యోగంలో మార్పు చోటు చేసుకోవడం గానీ జరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీసే అవకాశం కూడా ఉంది.
వృషభం: దశమ స్థానంలో దశమాధిపతి శనీశ్వరుడు, ఏప్రిల్ 30 నుంచి వృషభ రాశిలో గురువు, లాభ స్థానంలో రాహువు సంచారం బాగా అనుకూల ఫలితాలనిస్తాయి. ఈ రాశివారికి ఈ సంవత్సరంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో యోగదాయకమైన, లాభసాటి అయిన ఫలితాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యంగా కొన్ని శుభవార్తలు వినడం, ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసు కోవడం జరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉండి, దీర్ఘకాలిక రుణాలు సైతం తీర్చగలుగుతారు. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందు తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. చేపట్టిన వ్యవహారాలు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశముంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవు తాయి. సతీమణికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆధ్యాత్మిక చింతన పెరిగి, కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది.
మిథునం: భాగ్య స్థానంలో భాగ్య స్థానాధిపతి శని, దశమ స్థానంలో రాహువు, ఈ నెలాఖరు నుంచి వ్యయంలో గురువు సంచారం చేస్తున్నందువల్ల ఎక్కువగా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారు అక్కడే స్థిరపడే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు తమ కృషిలో సఫలం కావడం జరుగుతుంది. పిత్రార్జితం కలిసి వచ్చే అవకాశముంది. వ్యయ స్థానంలో ఉన్న గురువు వల్ల కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అయ్యే సూచనలున్నాయి. పుణ్యక్షేత్రాలకు, విహార యాత్రలకు ఎక్కువగా వెళ్లడం జరుగుతుంది. చతుర్థ స్థానంలో కేతు సంచారం వల్ల మధ్య మధ్య కుటుంబ సమస్యలు, గృహ, వాహన సమస్యలు ఉండవచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపా రాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్య తలు అప్పగిస్తారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రయాణాలు లాభి స్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు విజయాలు సాధిస్తారు.
కర్కాటకం: సంవత్సరమంతా అష్టమంలో శనీశ్వరుడు, భాగ్య స్థానంలో రాహువు, లాభ స్థానంలో గురువు సంచారం వల్ల చాలావరకు మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అష్టమ శని కారణంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం, ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడడం, స్వల్ప అనారోగ్య బాధలు ఉంటూ ఉంటాయి. అయితే, లాభ స్థానంలో గురు సంచారం వల్ల అనేక సమస్యలను అధిగమించడం జరుగుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. నిరుద్యోగులకే కాకుండా, ఉద్యోగం మారాలనుకుంటున్న ఉద్యోగులకు సైతం మంచి అవకాశాలు అందివస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యో గంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది.
సింహం: సప్తమ స్థానంలో శనీశ్వరుడు, అష్టమంలో రాహువు, దశమంలో గురువు సంచారం వల్ల ఏప్రిల్ 30 తర్వాత నుంచి ప్రతికూలతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇతర గ్రహాల కారణంగా కొంత కలిసి సూచనలు కూడా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. అయితే, సప్తమ శని కారణంగా కొన్ని ముఖ్యమైన వ్యవ హారాలు, ప్రయత్నాలు కొద్ది కష్టంతో సానుకూలపడతాయి. నిత్య జీవితంలో యాక్టివిటీ పెరుగు తుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించినా గుర్తింపు ఉండక పోవచ్చు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శుభ కార్యాలు నిర్వహిస్తారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయా నికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. అనవసర ఖర్చులతో ఇబ్బంది పడడం జరుగుతుంది. కొందరు మిత్రులు డబ్బుకు ఒత్తిడి తేవడం జరుగుతుంది. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది.
కన్య: ఆరవ స్థానంలో శనీశ్వరుడు, ఏప్రిల్ 30 నుంచి భాగ్య స్థానంలో గురువు సంచారం బాగా అనుకూలంగా ఉన్నప్పటికీ, సప్తమ స్థానంలో రాహువు వల్ల జీవిత భాగస్వామితో అడపాదడపా సమస్యలు తలెత్తే అవకాశముంటుంది. శని, గురువుల వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరగ డంతో పాటు, విదేశీ అవకాశాలు అందే సూచనలు కూడా ఉన్నాయి. నిరుద్యోగులు శుభ యోగాలను అనుభవిస్తారు. ఆర్థిక విషయాలన్నీ విజయవంతం అయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో ముఖ్యమైన సమస్యలను అధిగమించి అధికారులకు దగ్గరవుతారు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. కుటుంబసమేతంగా ఆల యాలు సందర్శిస్తారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక సమ స్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్, షేర్లకు దూరంగా ఉండడం మంచిది. ఆశించిన సమాచారం అందుతుంది. ఈ రాశిలో రాహువు ప్రవేశించినందువల్ల వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి. పరిచయస్థుల కారణంగా డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
తుల రాశి:  పంచమ స్థానంలో శని, ఆరవ స్థానంలో రాహువు, ఏప్రిల్ 30 తర్వాత నుంచి అష్టమంలో గురువు సంచారం వల్ల ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థిక విషయాల్లో ఎక్కు వగా తప్పటడుగులు వేయడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు సజావుగా, లాభదాయకంగా సాగిపోతాయి కానీ, ఆర్థిక ఇబ్బందులు మాత్రం తప్పకపోవచ్చు. నిరుద్యోగులకు సమయం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. సరైన ప్రయత్నాలు, నిర్ణయాలతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆదాయం ఆశించిన దాని కంటే బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ, ఖర్చుల మీద అదుపు ఉండకపోవచ్చు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు బాగా వృద్ధిలోకి వస్తారు. స్నేహితులతో విలాసాల మీద ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సతీమణి నుంచి ఆశించిన సహాయ సహ కారాలు అందుతాయి. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలున్నాయి. ఉద్యోగం మారే అవకాశం కూడా ఉంది.
వృశ్చిక రాశి:  నాలుగవ స్థానంలో శని, పంచమంలో రాహువు కొన్ని కష్టనిష్టాలను ఇచ్చే అవకాశముంది. వృత్తి, ఉద్యోగాలు మందకొడిగా ముందుకు సాగడం, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కాకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. అయితే, సప్తమ స్థానంలో గురు సంచారం ప్రారంభం అవుతున్నందువల్ల అనేక శుభ ఫలితాలు, శుభ యోగాలు అనుభవానికి రావడం కూడా జరుగుతుంది. గురువు సప్తమ స్థానంలో ఉన్నందువల్ల తప్పకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆశించిన మపెళ్లి సంబంధం కుదురుతుంది. మాట తొందర వల్ల కుటుంబంలో విభేదాలు, అపార్థాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది. ప్రముఖులతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఇంటా బయటా ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కుటుంబసమేతంగా విహార యాత్ర చేసే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
ధనస్సు:  తృతీయ స్థానంలో శని, నాలుగవ స్థానంలో రాహువు, ఆరవ స్థానంలో ఏప్రిల్ 30 నుంచి గురువు సంచారం వల్ల ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశముంది. నాలుగవ స్థానంలోని రాహువు, ఆరవ స్థానంలోని గురువు వృత్తి, ఉద్యోగాలపరంగా కొద్దిగా మానసిక ఒత్తిడి కల్పించే అవకాశముంది. ఇంటా బయటా అనుకూలతలు బాగా తగ్గుతాయి. తృతీయ శని కారణంగా ఆర్థిక పరిస్థితి లోటుండదు. ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం బాగా పెరిగినప్పటికీ ప్రతిఫలం ఉండే అవకాశముంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది. దైవ కార్యాలకు ఆర్థికంగా సహాయ పడతారు. స్నేహితుల సహా యంతో కీలకమైన పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆహార, విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది.
మకరం రాశి: ధన స్థానంలో ధనాధిపతి శనీశ్వరుడు, తృతీయ స్థానంలో రాహువు, ఏప్రిల్ 30 నుంచి పంచమ స్థానంలో గురువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనేక శుభ పరి ణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువులకు సంబంధించి సంతృప్తికరమైన సమాచారం అందుకుంటారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు. ఆరోగ్యం చాలావరకు పరవాలేదు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఎవరికీ హామీలు ఇవ్వకపోవడం, వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సంబంధించి సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరు గుతాయి. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్యలు క్రమంగా పరిష్కారమవు తాయి.
కుంభం: ఈ రాశిలో శని సంచారం, ద్వితీయంలో రాహువు, చతుర్థ స్థానంలో గురు సంచారం ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలనివ్వడం జరుగుతుంది. ఆదాయం పెరుగుతున్నప్పటికీ, ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం వృద్ది చెందుతుంది కానీ, పనిభారం లేదా బరువు బాధ్యతలు ఎక్కువై విశ్రాంతి తగ్గుతుంది. అయితే, ఏ విధంగా చూసినా శోభకృతు నామ సంవత్సరం కంటే క్రోధి నామ సంవత్సరం బాగా అనుకూలంగా ఉండే అవకాశముంది. దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవు తుంది. ఆదాయ వృద్ధి సూచనలున్నాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలున్నప్పటికీ, చివరికి అంతా సానుకూలంగా జరిగిపోతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా, ఆనందంగా కాలక్షేపం చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు సతీమణికి అనుకూలంగా ఉంటాయి.
మీన రాశి: వ్యయ స్థానంలో శనీశ్వరుడు (ఏలినాటి  శని), మీన రాశిలో రాహువు, రాశ్యధిపతి గురువు తృతీయ సంచారం వంటివి ఈ రాశికి ఏమాత్రం అనుకూలంగా లేవనే చెప్పాలి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం తగ్గుతుంది. వ్యాపారాల్లో లాభాలు మందగిస్తాయి. కుటుంబ వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. బంధుమిత్రులతో సంబంధాలు బెడిసికొడతాయి. అయితే, ఇతర గ్రహాల అనుకూలత వల్ల ఆర్థిక వ్యవహారాలు చాలావరకు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, సకాలంలో, సంతృప్తికరంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు తేలికగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో కూడా అంచనాలను అందుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు చదువు ల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి కూడా శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లకపోవచ్చు. ఉద్యోగ ప్రయ త్నాలు మాత్రం సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!