Saturday, July 27, 2024
Homeతెలంగాణషడ్రుచుల సమ్మేళనం ఉగాది

షడ్రుచుల సమ్మేళనం ఉగాది

షడ్రుచుల సమ్మేళనం ఉగాది

పక్షుల కిలకిలలతో, ఆకుల చిగురులుతో, కోకిల సు స్వరాల రాగాలతో, పూల పరిమళాల తో అందంగా ఉంటుంది ఈ సమస్త ప్రకృతి. అయితే ఈ ప్రకృతి అందాలని ప్రత్యక్షంగా చూస్తే తెలిస్తే… పరోక్షంగా కవి కలంలో, ఉగాది పాటల్లో కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చే తెలుగు సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం.

సుల్తానాబాద్, ఏప్రిల్ 9,(కలం శ్రీ న్యూస్):

ఉగాది.. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ.. ఆయుష్షు అని అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది. అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్షుకు మొదటిరోజు కాబట్టి ఉగాదిగా మారింది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడే కలియుగం ప్రారంభమైంది. త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది. ఈ రోజే శ్రీమహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. విక్రమార్కుడు, శాలివాహన చక్రవర్తి ఉగాది రోజునే సింహాసనాన్ని అధిష్ఠించారు. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు.

ఉగాది పర్వదినాన తెల్లవారుజామునే లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఈరోజున పంచాంగ శ్రవణం, షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి ని తినడం ప్రశస్త్యమైంది. మహిళలు ఉగాది పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. “ఉగాది పచ్చడి” ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం – తీపి, పులుపు, ఉప్పు , కారం, చేదు, వగరు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.

 

ఉగాది ప్రాముఖ్యత:

ఉగాది ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది మన తెలుగు పండుగ అని. ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఈ రోజు కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.

ఆనాటి కాలం నుంచి వస్తున్న పండుగల్లో ముఖ్యమైన పండుగ మన ఉగాది పండుగ. ఈ పండుగ సాధారణంగా మార్చి నెలలో లేదా కొన్ని సార్లు ఏప్రిల్ నెలలో రావడం జరుగుతుంది . ఉగాది అనేది ఒక్క రోజు పండుగ. తెలుగు ప్రజలు మాత్రమే కాక మరాఠీలు గుడి పడ్వాగా ను, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ ఈ నూతన సంవత్సర పండుగ ని జరుపుకుంటారు.

ఉగాది చైత్ర మాసం లో వస్తుంది. పక్షుల కిలకిలలతో, ఆకుల చిగురులుతో, కోకిల సుస్వరాల రాగాలతో, పూల పరిమళాల తో అందంగా ఉంటుంది ఈ సమస్త ప్రకృతి. అయితే ఈ ప్రకృతి అందాలని ప్రత్యక్షంగా చూస్తే తెలిస్తే… పరోక్షంగా కవి కలంలో, ఉగాది పాటల్లో కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చే తెలుగు సంవత్సరం శ్రీ క్రోది నామ సంవత్సరం. శిశిర ఋతువులో ఆకులు రాలి ఆ తర్వాత వసంతం వస్తుంది. ఈ సమయం లో ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి తెలుగు వారు ఈ పండుగని బాగా జరుపుకుంటారు. ఇదే సంవత్సరం లో వచ్చే మొదటి పండుగ కనుక కొత్తగా పనులని ప్రారంభిస్తారు.

పండుగ రోజు చక్కగా తెల్లవారే నిద్ర లేచి ఇల్లు, పరిసరాలు శుభ్ర పరుచుకుని, మామిడి తోరణాలతో అలంకరించి, తల స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. అలానే అన్నింటి కంటే ముఖ్యం అయినది ఉగాది పచ్చడి. అయితే ఈ ఉగాది పచ్చడిని అనేక ప్రాంతాల వాళ్ళు అనేక విధాలుగా చేసుకుంటారు. అయితే ఇందులో ప్రత్యేకం అయినవి షడ్రుచులు. మధురం, ఆమ్లం, లవణం, కటు, తిక్త, కషాయం. ఇలా ఈ ఆరు రుచులు ఉగాది పచ్చడిలో ప్రదానం . మధురం అంటే తీపి ,ఆమ్లం అంటే పులుపు ,లవణం అంటే ఉప్పు , కటు అంటే కారం ,తిక్త అంటే చేదు ,కషాయం అంటే వగరు . షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి . ఎదురయ్యేది కష్టమైన సుఖమైనా సంయమనం తో ప్రతి ఒక్కరు స్వీకరించాలి అని మన ఉగాది పచ్చడి తెలియచేస్తుంది. ఒకొక్కరు ఒక్కో విధంగా పచ్చడిని తయారు చేస్తారు. అయితే ఈ పచ్చడి లో చెరకు అరటి పళ్ళు , మామిడి కాయలు , చింతపండు, వేప పువ్వు , జామ కాయలు, బెల్లం వగైరా పదార్దాలను వాడుతారు. హిందువులు కి అత్యంత శ్రేష్ఠమైన పండుగ ఇది.

 

ఉగాది పచ్చడి ప్రాముఖ్యత :

 

ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక.

బెల్లం – తీపి – ఆనందానికి సంకేతం

ఉప్పు – జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం

వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు

చింతపండు – పులుపు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు

పచ్చి మామిడి ముక్కలు – వగరు – కొత్త సవాళ్లు

కారం – సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు

ఉగాది రోజు తప్ప చేయాల్సినవి:

ఉగాది పండుగ తరతరాల నుండి జరుపుకుంటున్న పండుగ. ఈ పండుగ రోజు వేప పువ్వు పచ్చడి అంటే ఉగాది పచ్చడిని తప్పక తినాలి. అలానే పంచాంగ శ్రవణమ్, ఆర్య పూజానం, గోపూజ, మిత్ర దర్శనమ్ వంటి ఈ ఆచారాల్ని తప్పక పాటించాలి.ఈ పచ్చడి కోసం చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం వంటివి వాడతారు. ఇక ఉగాది సంప్రదాయాల్లో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కలిసి నిష్ణాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్టులను ఆహ్నానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణము చేస్తారు. ఈ రోజు అందరూ నూతన సంవత్సరంలోని శుభశుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావిజీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు. ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల, తిథితో సంపదను, వారంతో ఆయుష్షు, నక్షత్రంతో పాపప్రక్షాళ, యోగం వలన వ్యాధి నివృత్తి కావడం, కరణంవల్ల గంగాస్నానం చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసం. మరి ఈ ఉగాది సర్వులకు ఆయురారోగ్యాలు, సంపదలు, సుఖమయజీవనాన్ని అందించాలని ఆశిస్తూ.. కలం శ్రీ న్యూస్ పాఠకులకు

ఉగాది పర్వదిన శుభాకాంక్షలు….

మీ సుంక శ్రీధర్ (M.D).

 

 

 

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!