Saturday, July 27, 2024
Homeతెలంగాణఇఫ్తార్ విందులు సోదరా భావాన్ని పెంపొందిస్తాయి

ఇఫ్తార్ విందులు సోదరా భావాన్ని పెంపొందిస్తాయి

ఇఫ్తార్ విందులు సోదరా భావాన్ని పెంపొందిస్తాయి

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

సుల్తానాబాద్,ఏప్రిల్7(కలం శ్రీ న్యూస్):

ఇఫ్తార్ విందులు సోదర భావాన్ని పెంపొందిస్తాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో ముస్లిం సోదరులకు ఆత్మీయ ఇఫ్తార్ విందును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నెల రోజులు లోక కళ్యాణానికి అత్యంత భక్తి శ్రద్దలతో ఉపవాసం ఉండి, సమాజంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకుంటారని అన్నారు. నెలరోజుల ఉపవాస దీక్షలో అనేక సత్ ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన  ఎమ్మెల్యేను స్థానిక ముస్లిం మతపెద్దలు ఘనంగా సన్మానించారు.

 

ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, సుల్తానాబాద్ పట్టణ కౌన్సిలర్స్, మైనారిటీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!