Saturday, July 27, 2024
Homeతెలంగాణఐపీఎస్ పాఠశాలలో ఉచిత మెగా దంత వైద్య శిబిరం

ఐపీఎస్ పాఠశాలలో ఉచిత మెగా దంత వైద్య శిబిరం

ఐపీఎస్ పాఠశాలలో ఉచిత మెగా దంత వైద్య శిబిరం

సుల్తానాబాద్,మార్చి 20 (కలం శ్రీ న్యూస్): మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలంటే తరచూ దంత వైద్య పరీక్షలు చేసుకోవాలని సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మణిదీప్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఇండియన్ పబ్లిక్ పాఠశాల డైరెక్టర్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ మాటేటి కృష్ణప్రియ తో కలిసి దంత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు దంత వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. అంతకుముందు ఎమ్మెల్యే హరీష్ బాబు జ్యోతి వెలిగించి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.మనిషి జీవితంలో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే దంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ముఖ్యంగా చిన్నారులకు చిరుతిళ్ళు అలవాట్లు అధికంగా ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు దంతాల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాగే తల్లిదండ్రులు సైతం నోటి వ్యాధులు తలెత్తకుండా ఉండాలంటే తరచు దంత వైద్య పరీక్షలు చేసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం సైతం ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దంత వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్యులను నియమించాలని కోరారు. ఇందుకోసం భవిష్యత్తులో అసెంబ్లీలో పోరాటం చేసి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. డైరెక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ఇండియన్ పబ్లిక్ పాఠశాల పూర్వ విద్యార్థి అయిన మణిదీప్ ఈ పాఠశాలను ఎంపిక చేసుకుని ఇక్కడ ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత కృష్ణ, కౌన్సిలర్ దున్నపోతుల రాజయ్య, టి డి ఎస్ ఏ ఉపాధ్యక్షురాలు డాక్టర్ శ్రీజ గజవెల్లి,దంత వైద్యురాలు మహాలక్ష్మి, డాక్టర్ విగ్నేష్ గౌడ్ జూలూరి, సుల్తానాబాద్ మండలం ప్రజలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!