Saturday, July 27, 2024
Homeతెలంగాణవిద్యార్థులు విజ్ఞాన శాస్త్రాన్ని పెంపొందించుకోవాలి

విద్యార్థులు విజ్ఞాన శాస్త్రాన్ని పెంపొందించుకోవాలి

విద్యార్థులు విజ్ఞాన శాస్త్రాన్ని పెంపొందించుకోవాలి

మండల విద్యాధికారి సురేందర్

సుల్తానాబాద్,మార్చి16(కలం శ్రీ న్యూస్):విద్యార్థులు విజ్ఞాన శాస్త్రాన్ని పెంపొందించుకోవాలని సుల్తానాబాద్ మండల విద్యాధికారి సురేందర్ అన్నారు. పట్టణంలోని కేరళ మోడల్ హైస్కూల్లో నిర్వహించిన విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనను ఎంఇఓ సురేందర్ శనివారం ప్రారంభించారు. అనంతరం పలువురు విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్ట్ ల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా సురేందర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తిని పెంపొందించేందుకు విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.

రోబోటిక్ ఫైర్ ఎక్స్టెంఘిషర్, వర్టికల్ ఫార్మింగ్, గ్రీన్ హౌస్, లేజర్ సెక్యూరిటీ, డయాలసిస్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ వాటర్ లెవెల్ ఇండికేటర్, చంద్రయాన్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, వాషింగ్ మెషిన్ లకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రదర్శించిన పలువురు విద్యార్థులను ఎంఈఓ సురేందర్ అభినందించారు. నర్సరీ నుండి పదవ తరగతి విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ సిజ్జూ ఎస్. నాయర్, వైస్ ప్రిన్సిపల్ స్మిత ఎస్.నాయర్, సిఆర్పి సదానందం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!