Saturday, July 27, 2024
Homeతెలంగాణహెచ్ఐవి, క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం

హెచ్ఐవి, క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం

హెచ్ఐవి, క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం

సుల్తానాబాద్,మార్చి13(కలం శ్రీ న్యూస్):

సుల్తానాబాద్ మున్సిపల్ లోని పూసాల రోడ్డు చౌరస్తా వద్ద పద్మపాని సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం క్రాంతి కళా బృందం కళాకారుల చె హెచ్ఐవి క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు పద్మపాని సొసైటీ డిస్టిక్ కో ఆర్డినేటర్ లోకిని రమేష్ తెలిపిన వివరాల ప్రకారం వ్యాధులు అనేటివి చెప్పి రావడం లేదని, చాలామంది వ్యాధుల బారిన పడి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారని, చాలా కుటుంబాలు క్షయ వ్యాధి వల్ల హెచ్ఐవి వ్యాధి వల్ల రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయనీ, అలాంటి క్షయ వ్యాధి, హెచ్ఐవి వ్యాధి రాకుండా సుల్తానాబాద్ మున్సిపల్ లో పూసాల రోడ్డు చౌరస్తా వద్ద పద్మపాని సొసైటీ ఆధ్వర్యంలో క్రాంతి కళా బృందం కళాకారులచే అలాంటి వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించామని, ప్రజలందరూ ఎలాంటి వ్యాధి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పద్మపాని సొసైటీ డిస్టిక్ కో ఆర్డినేటర్ లోకిని రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో క్రాంతి కళాబృంద కళాకారులు వెంకటాచారి, నల్ల ఆంజనేయులు,మాధవి, ప్రకాష్, పద్మపాని సొసైటీ లింక్ వర్కర్లు శ్రీలత, సంపత్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!