Wednesday, December 4, 2024
Homeతెలంగాణమున్సిపల్ ను అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తా

మున్సిపల్ ను అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తా

మున్సిపల్ ను అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తా

మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు

సుల్తానాబాద్,మార్చి11(కలం శ్రీ న్యూస్): మున్సిపల్ ను అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో బడ్జెట్ సమావేశం 2024-2025 సంవత్సర ఆర్థిక ఆదాయ వ్యయలపై మున్సిపల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ ను రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పరిచేందుకు స్థానిక శాసనసభ్యులు చింత కుంట విజయ రమణారావు సహకారంతో నిధులు వెచ్చించి మానేరు వాగు నుండి శాశ్వత మంచినీటి పరిష్కారానికి పాలకవర్గ సభ్యులతో కలిసి కృషి చేస్తామని, అలాగే మున్సిపల్ లో ఉన్న ఇతర సమస్యలను ఆయా వార్డు కౌన్సిలర్ల సౌజన్యంతో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామని తెలిపారు. కాలనీలలో సిసి రోడ్లు, డ్రైనేజీలతో పాటు ఇతర సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం బడ్జెట్ పై సమావేశం కొనసాగింది. 2024-2025 మున్సిపాలిటీ ఆర్థిక సంవత్సరం అంచనా బడ్జెట్ మొత్తం 960.67 లక్షలు కాగా ,2024-2025. సంవత్సరం సాధారణ నిధులు అంచనా ఆదాయం 291.77 లక్షలు కాగా, అంచనా వ్యయం 307.59 లక్షలు 2023-24 సంవత్సరపు సవరణ అంచనా ఆదాయం 270.57 లక్షలు కాగా, వ్యయం 253.95 లక్షలు గా పేర్కొన్నారు. మిగులు ఆదాయం 13.35 లక్షల అని తెలిపారు. ఈ సమావేశంలో కమీషనర్ కట్ల వేణుమాధవ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత కృష్ణ, కౌన్సిలర్ లు పసెడ్ల మమత సంపత్,  నిషాద్ రఫీక్, ఊట్ల వర ప్రదీప్,  కూకట్ల గోపి, చింతల సునీత రాజు, గొట్టం లక్ష్మి మల్లయ్య, అనుమల అరుణ బాబురావు, రేవెల్లి తిరుపతి, దున్నపోతుల రాజయ్య, గుర్రాల శ్రీనివాస్, కోఆప్షన్లు సయ్యద్ సాజీద్, ఫాతిమా ఖలీం, మెంగాని రాధ, మేనేజర్ అలీముద్దీన్, సిబ్బంది పలువురు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!