నిర్విరామంగా కొనసాగుతున్న శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్
చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు
సుల్తానాబాద్,మార్చి11(కలం శ్రీ న్యూస్):నిత్యం వార్డు సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమo నిర్విరామంగా కొనగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు శ్రీరామ్ నగర్ లో పారిశుధ్య పనులను చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ వార్డు ప్రజలు కాలనీలను పరిశుభ్రంగా ఉంచేందుకు బాధ్యతగా వ్యవహరించాలని, కాలనీలు శుభ్రంగా ఉంచుకునేoదుకు మురుగు కాలువలలో చెత్త చెదారం వేయవద్దని, సింగిల్ యుజ్ ప్లాస్టిక్ కవర్లు వంటి వస్తువులను పూర్తిగా నిషేధించాలని, వాటి ద్వారా అనేక ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు .కాలనీలలో రోడ్ల పై గాని ఇంటి చుట్టుపక్కల ఎలాంటి పిచ్చి మొక్కలు చెత్త చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకుంటే దోమలు ఈగలు దరిచేరకుండా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తో పాటు 9వ వార్డ్ కౌన్సిలర్ గొట్టెం లక్ష్మి మల్లయ్య శానిటరీ ఇన్స్ స్పెక్టర్ శ్రవణ్ కుమార్, జవాన్ ఆనంద్ లతో పాటు కాలనీవాసులు, పలువురు పాల్గొన్నారు.