Saturday, April 20, 2024
Homeతెలంగాణనా నేస్తం చారిటబుల్ ట్రస్ట్  సామాజిక సేవ అందరికి స్పూర్తి దాయకం

నా నేస్తం చారిటబుల్ ట్రస్ట్  సామాజిక సేవ అందరికి స్పూర్తి దాయకం

నా నేస్తం చారిటబుల్ ట్రస్ట్  సామాజిక సేవ అందరికి స్పూర్తి దాయకం

ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు

ఏలిగేడు,మార్చి08(కలం శ్రీ న్యూస్): గత పది సంవత్సరాల ప్రస్థానంలో నా నేస్తం చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన సామాజిక సేవ అందరికి స్పూర్తి దాయకం అని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శుక్రవారం ఎలిగేడు లో నా నేస్తం సేవా భవనం ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలిగేడు మండలానికి వైకుంఠ రథాన్ని అందజేయడమే కాక, యువత కోసం కార్ డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమం చేపట్టడం మంచి ఆలోచన అన్నారు. సమాజ సేవ చేసే సంస్థలకు తమ వంతు తోడ్పాటును అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని అన్నారు. అనంతరం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మండిగ రేణుక డ్రైవింగ్ శిక్షణ కారును ప్రారంభించారు. నా నేస్తం అధ్యక్షుడు పెంట శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మండిగ రేణుక, సింగిల్ విండో చైర్మన్ గోపు విజయభాస్కర్ రెడ్డి, ఎలిగేడు మాజీ సర్పంచ్ బూర్ల సింధుజ, ఉప సర్పంచ్ కోరుకంటి వెంకటేశ్వరరావు, నా నేస్తం గౌరవాధ్యక్షుడు అర్షణపల్లి రాజేశ్వరరావు, పూర్వ అధ్యక్షులు కట్ల సత్యనారాయణ , బూర్ల వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి వెంగళదాసు అశోక్, స్థానిక సీఐ, ఎస్ఐ, నా నేస్తం కుటుంబ సభ్యులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు­.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!