పెద్దపల్లిలో భారీ అగ్నిప్రమాదం…
షార్ట్ సర్క్యూట్ తో మూడు దుకాణాలు దగ్ధం..
పెద్దపల్లి,మార్చి8 (కలం శ్రీ న్యూస్): పెద్దపల్లి లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలోని జండా చౌరస్తా సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ లో షార్ట్ సర్క్యూట్ తో మూడు దుకాణాలు బూడిదయ్యాయి. వాచ్ సెంటర్ లో మొదట షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి పక్కనే ఉన్న పూజా సామాగ్రి దుకాణం తో పాటు, మొబైల్ సెంటర్ లోకి వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తేవడంతో షాపింగ్ కాంప్లెక్స్ లోని మిగతా దుకాణాలకు మంటలు వ్యాపించకుండా నియంత్రించ గలిగారు.